Advertisementt

కుబేర: ఆహా ఓహో అన్నారుగా..

Sun 03rd Aug 2025 05:42 PM
naga vamsi  కుబేర: ఆహా ఓహో అన్నారుగా..
Naga Vamsi comments on Kuberaa collection కుబేర: ఆహా ఓహో అన్నారుగా..
Advertisement
Ads by CJ

శేఖర్ కమ్ముల తెరకెక్కించిన కుబేర చిత్రం జూన్ లో థియేటర్స్ లో విడుదల కాగా.. ఆ చిత్రం సూపర్, ఆహా ఓహో అంటూ క్రిటిక్స్ అదిరిపోయే రేటింగ్స్ ఇచ్చారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు అందరూ యునానమస్ గా కుబేర బ్లాక్ బస్టర్ హిట్ అన్నారు. ధనుష్, నాగార్జున యాక్టింగ్ సూపర్, మ్యూజిక్ అదిరిపోయింది, శేఖర్ కమ్ముల మేకింగ్ అద్భుతం అన్నారు. 

సోషల్ మీడియా మొత్తం కుబేర చిత్రాన్ని పొగుడుతూ పోస్ట్ లు వెలిసాయి. కట్ చేస్తే సినిమాకి తెలుగులో తప్ప మిగతా లాంగ్వేజెస్ లో కలెక్షన్స్ రాలేదు అనేది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు నిర్మాత నాగవంశీ కూడా కింగ్ డమ్ ప్రమోషన్స్ లో కుబేర కలెక్షన్స్ విషయంలో చేసిన కామెంట్స్ మాత్రం హాట్ హాట్ గా వైరల్ అవుతున్నాయి. 

కుబేర చిత్రాన్ని అందరూ ఆహా ఓహో అంటూ ఆకాశానికి ఎత్తేసారు. కథ బావుంది, బట్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో అందరూ చూసారు అంటూ సోషల్ మీడియాలో హైపింగ్ పోస్ట్ లు ఎందుకు పనికిరావని తేల్చేసారు నిర్మాత నాగవంశీ. ఇక ఓటీటీలోనూ కుబేర చిత్రానికి అంతగా సూపర్ రెస్పాన్స్ అయితే రాలేదు. 

Naga Vamsi comments on Kuberaa collection:

Naga Vamsi made striking remarks about low collections

Tags:   NAGA VAMSI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ