Advertisementt

పెళ్లి కాకుండానే వరలక్షి వ్రతాలా

Sun 03rd Aug 2025 05:24 PM
siri  పెళ్లి కాకుండానే వరలక్షి వ్రతాలా
Priyanka Jain shared beautiful pictures from her varalakshmi Vratham పెళ్లి కాకుండానే వరలక్షి వ్రతాలా
Advertisement
Ads by CJ

పెళ్లి చేసుకోకుండా వరలక్ష్మి వ్రతం చేసుకోకూడదు అనే రూల్ ఏమి లేదు. లక్ష్మి పూజ ఎవరైనా చేసుకోవచ్చు. పెళ్లి అయిన ఆడవాళ్ళు భర్త క్షేమం కోసం అమ్మవారికి భక్తితో పూజ చేసుకుని ఆ పూజలో కలశం పెట్టుకుని, లక్ష్మి రూపు కొనుక్కుని అమ్మవారికి వాయనం ఇవ్వడమనేది పెళ్ళైన ఆడవాళ్ళ ఆనవాయితిగా శ్రావణమాసంలో చేసుకునే పూజ. 

అయితే కొంతమంది సీరియల్ నటులు యూట్యూబ్ వీడియోస్ కోసమో, లేదంటే భక్తి ఎక్కువయ్యో తెలియదు కానీ.. పెళ్లి చేసుకోకుండానే బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి పూజ లు చేసుకోవడం నెటిజెన్స్ నుంచి వెటకారంగా కామెంట్స్ పడేలా చేసింది. ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న సిరి హన్మంత్, శ్రీహన్ లు ప్రేమలో ఉన్నారు, లివింగ్ రిలేషన్ లో ఉన్నారు . కానీ పెళ్లి చేసుకోలేదు. 

ఈ జంట నూతన వధూవరులు వలే పక్కపక్కనే కూర్చుని శ్రావణ శుక్రవారం వ్రతం చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. ఇక మరో నటి ప్రియాంక జైన్ తన బాయ్ ఫ్రెండ్ శివ కుమార్ తో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకుని ఆ వీడియోస్, ఫొటోస్ షేర్ చెయ్యడం అందరికి షాకిచ్చేలా చేసింది. కొంతమంది కాబోయే భర్త తో పూజ చేసుకుంటే తప్పేముంది అంటే.. మరి కొంతమంది పెళ్లి కాకుండానే వరలక్ష్మి వ్రతాలా అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Priyanka Jain shared beautiful pictures from her varalakshmi Vratham:

Siri Hanumanth shared beautiful pictures from her varalakshmi Vratham

Tags:   SIRI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ