లోకేష్ కనగరాజ్ నుంచి ఆగష్టు 14 న ఆడియన్స్ ముందుకు రాబోతున్న కూలి: ద పవర్ హౌస్ కోసం తమిళ ఆడియన్స్ మాత్రమే కాదు ఖైదీ, విక్రమ్ చిత్రాలు చూసిన ప్రతి ఒక్క లాంగ్వేజ్ ప్రేక్షకులు వెయిట్ చేస్తారు. కూలి అంటూ సూపర్ స్టార్ రజినీకాంత్ ని డైరెక్ట్ చెయ్యడం ఒక సెన్సేషన్ అయితే.. అందులో కింగ్ నాగార్జున విలన్ గా కనిపించడం మరో ఎత్తు. ఈమద్యలో బాలీవుడ్ నుంచి ఆమిర్ ఖాన్ గెస్ట్ అప్పీరియన్స్ మరింత ఇంట్రెస్టింగ్ కలిగించే విషయం. కన్నడ నుంచి ఉపేంద్ర, మలయాళం నుంచి సౌబిన్ సాహిర్ కూలి లో నటించడం వెరీ వెరీ స్పెషల్స్.
ఇక లోకేష్ కనగరాజ్ కూలి ట్రైలర్ తోనే అన్ని కేరెక్టర్స్ రివీల్ అవుతాయంటూ ఆసక్తి రేపినట్టుగానే పవర్ ప్యాక్డ్ ట్రైలర్ ని వదిలారు. ట్రైలర్ లో రజినీకాంత్ యాక్షన్ వేరే లెవల్, కింగ్ నాగార్జున విలన్ లుక్ కానివ్వండి, ఆయన కేరెక్టర్ అన్ని పవర్ ఫుల్ గా ఉన్నాయి. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీలో డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. కూలీ నెంబర్ 1421గా దేవా రోల్‌లో రజినీ మాస్ లుక్ అదిరిపోయింది.
ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసానిలా ప్రతి పాత్ర బలంగా కనిపించడమే కాదు లుక్స్ విషయంలో అందరిని లోకేష్ కనగరాజ్ శాటిస్ ఫై చేసారు. కూలి ట్రైలర్ లో పవర్ ఫుల్ డైలాగ్స్, అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, లోకేష్ కానగరాజ్ మేకింగ్ స్టయిల్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని రిచ్ గా కనిపించాయి.
కూలి ట్రైలర్ పవర్ ఫుల్ పవర్ హౌస్ అంటూ సూపర్ స్టార్ అభిమానులు మాత్రమే కాదు మిగతా నటుల ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.