అక్రమ మైనింగ్ కేసులో నోటీసులు అందుకుని విచారణకు హాజరు కావాల్సిన అనిల్ కుమార్ యాదవ్ తాజాగా తనపై కేసుల విషయంలో చంద్రబాబు, కూటమి ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు క్వార్ట్జ్ మైనింగ్ కి పాల్పడిన అనిల్ కుమార్ యాదవ్ పై కేసు నమోదు కావడమే కాదు నల్లపురెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అనిల్ కుమార్ యాదవ్ A 2గా ఉన్నారు.
తాజాగా అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబు పై విరుచుకుపడ్డారు. గతంలో కాకాణితో నాకు మనస్పర్థలు ఉండేవి.. మేం కలిసి ఎలా వ్యాపారం చేస్తాం. నా పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు, గూడూరులో ఇసుక అక్రమాలకు పాల్పడినట్లు కేసు పెట్టారు. ఆఫ్రికా, విదేశాల్లో ఆస్తులు కొన్నట్టు ప్రచారం చేస్తున్నారు. నా ఆస్తులపై సిట్ వేయాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేస్తున్నా. గతంలో కంటే నా దగ్గర ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా నన్ను శిక్షించండి, వెయ్యి కోట్లు ఉన్నాయంటున్నారు.. ఉంటే అమరావతికి తీసేసుకోండి. నేనే అమరావతికి ఇచ్చేస్తాను.
నేను ఎలాంటి అక్రమాస్తులను సంపాదించలేదు.. ఆఫ్రికాలో నాకు ఎలాంటి మైనింగ్స్ లేవు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించమని డిమాండ్ చేస్తున్నా, 2008కి ముందున్న ఆస్తులకపై ఇప్పుడున్న ఆస్తులపై విచారణకు నేను సిద్ధం. నా ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి.. క్వార్ట్జ్ మైనింగ్ పై ఈడీ విచారణ చేయించండి. నల్లపురెడ్డి వ్యాఖ్యల కేసులో 4న విచారణకు వెళ్తా, జైలుకు వెళ్లేందుకైనా నేను సిద్ధం అంటూ అనిల్ కుమార్ యాదవ్ చాలేజ్ చేశారు.