థాంక్యూ డియర్ రివ్యూ
ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా కలయికలో తోట శ్రీకాంత్ రచన దర్శకత్వంలో తెరకెక్కిన థాంక్యూ డియర్ చిత్రం నేడు ఆగష్టు 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ లో సినిమాని చూడాలనే ఆసక్తి కలిగించింది. మరి ఈ లవ్ అండ్ సెన్సిబుల్ థాంక్యూ డియర్ ప్రేక్షకులకు ఎంత రీచ్ అయ్యిదో సమీక్షలో చూసేద్దాం..
కథ :
ఓ సాధారణ వ్యక్తి దర్శకుడు కావాలనే ఆశయంతో హైదరాబాదులో కష్టపడుతూ ఉంటాడు. అతని జీవితంలోకి నటి కావాలని కోరికతో ఒక అమ్మాయి వస్తుంది. అలాగే మరొక అమ్మాయిని అది ఒకడు ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అలా హ్యాపీగా సాగిపోతున్న వారి జీవితాలలో తమ పెళ్లి తర్వాత ఎటువంటి మార్పులు వచ్చాయి? తమ జీవితంలోకి వచ్చిన మరొక అమ్మాయి వల్ల వీరి జీవితాల్లోకి ఎటువంటి మలుపులు వచ్చాయి? స్పైడర్ లో చూపించినట్లు వరుస హత్యలు చేస్తుంది ఎవరు? వారికి ఈ దంపతులకు ఉన్న సంబంధం ఏంటి? అసలు ఆ హత్యలు చేయడానికి గల కారణమేంటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై థాంక్యూ డియర్ చిత్రం చూడాల్సిందే.
నటీనటుల నటన :
సినిమాలో హీరోగా తంత్ర ఫ్రేమ్ నటుడు ధనుష్ రఘుముద్రి (సత్యం) తన పాత్రలో చాలా బాగా నటించారు. ఎన్నో సినిమాలలో నటించినట్లు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న నటుడిలా రెండవ సినిమాకి నటించడం గొప్ప విషయం. డైలాగ్స్ దగ్గర నుండి ఎక్స్ప్రెషన్స్ వరకు, అలాగే ప్రతి సీనులను తనదైన శైలిలో నటిస్తూ తన పాత్రను బాగా పండించాడు.
సినిమాలో హీరోయిన్ గా హెబ్బా పటేల్ (ప్రియా) పాతలో నటించగా కొన్ని వేరియేషన్స్ తో కూడిన తన పాత్రను అద్భుతంగా పండించారు. ఇప్పటికే ఎన్నో రకాలైన పాటలలో నటించిన హెబ్బా పటేల్ ఈ చిత్రంలో కూడా తనదైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు.
చిత్రంలో మరొక హీరోయిన్ రేఖ నిరోషా(జానకి) పాత్రలో అటు ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో పాటు మరొక కోణాన్ని కూడా ఎంతో అద్భుతంగా చేసి చూపించారు. ఇప్పటివరకు తాను ఇటువంటి పాత్ర పోషించకపోవడంతో ఈ సినిమాలోని తన పాత్ర ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుంది.
అలాగే చిత్రంలో పలు కీలక ప్రజల పోషించిన వీరశంకర్, నాగ మహేష్, రవి ప్రకాష్ తదితరులు తమ పాత్రలకు తగ్గట్లు తమ పరిధిలో తమ నటిస్తూ సినిమాకు బోనస్గా నిలిచారు. బలగం సుజాత, చత్రపతి శేఖర్ వెండితెరపై కనిపించిన సమయం తక్కువ అయినప్పటికీ వారి పాత్ర సినిమాకు మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. అలాగే వివిధ ఇతర పాత్రలలో నటించిన వారంతా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు.
సాంకేతిక విశ్లేషణ :
దర్శకుడు తోట శ్రీకాంత్ తాను రాసుకున్న కథను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి కోసం వెండి తెరపై చాలా బాగా చూపించారు. స్క్రీన్ ప్లే నిదానంగా ఉన్నప్పటికీ ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చిత్రాన్ని చిత్రీకరించారు. బిజిఎం అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ సినిమాలోని పాటలు సినిమాకు బోనస్ గా నిలిచాయి. డబ్బింగ్ విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బాగుండేది. అయితే డైలాగులు సినిమాలో చాలా బాగా పండాయి. లొకేషన్లు చాలా న్యాచురల్ గా అద్భుతంగా ఉన్నాయి. కలరింగ్ ఇంకా ఇతర సాంకేతిక విషయాలు చూస్తుంటే నిర్మాణం విలువల విషయంలో నిర్మాత పప్పు బాలాజీ రెడ్డి ఎంత జాగ్రత్తలు తీసుకున్నారు అర్థమవుతుంది.
చిత్ర విశ్లేషణ :
నేటి సమాజంలోని వివిధ అంశాలను తీసుకొని ఎవరు ముట్టుకొని వాటిని ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చూపించే దిశగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాడు దర్శకుడు. కొన్ని వ్యసనాల వల్ల జీవితాలు ఎలా మారిపోతాయి అలాగే కొంతమంది చేసే అసాంఘిక చర్యల వల్ల ప్రజలలో ఎటువంటి మార్పులు వస్తాయి అంటూ చూపించే ప్రయత్నం థాంక్యూ డియర్. కొన్ని సీన్లు నిదానంగా ఉన్నప్పటికీ ఈ కథకు తగ్గట్లు స్క్రీన్ ప్లే నడుస్తుంది.
సారాంశం :
వ్యసనాల వల్ల జీవితాలు ఎలా మారిపోతాయి, అలాగే సామాజిక స్పృహ ప్రజలకు ఎంత అవసరం అంటూ చూపించే ప్రయత్నంతో కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం థాంక్యూ డియర్.
Thank You Dear Movie Review