తలైవా రజనీకాంత్ 74 వయసులోను ఎంతో ఉత్సాహంగా సినిమాల్లో నటిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ సత్తా చాటుతున్నారు. అయితే ఆయన వయసు సంబంధిత సమస్యలతో కొంత ఇబ్బంది పడుతూ అప్పుడప్పుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనే వార్తలు అభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు రజనీకాంత్ తన ఇంటి గార్డెన్ లో నడుచుకుంటూ గేటు వద్దకు వెళ్లి న్యూస్ పేపర్ అందుకుని వస్తూ జారి పడ్డారు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి వైరల్ గా మారుతోంది. తోటలో తడిగా ఉన్న స్థలంలో కాలు స్లిప్ అయింది. అయితే ఆ వ్యక్తి రజనీకాంత్ అని సోషల్ మీడియాల్లో పేర్కొంటున్నా కానీ, నిజానికి అతడు రజనీ కాదని చాలా మంది విశ్లేషిస్తున్నారు. జారి కింద పడగానే ఒక యువకుడిలా వెంటనే చేతిపై ఆనుకుని పైకి లేచి నిలబడి ఠీవిగా నడిచి వెళ్లిపోతున్నారు.
కానీ ఇంత లేటు వయసులో అది అంత సులువు కాదు. అతడు సూపర్ స్టార్ రజనీకాంత్ అనేందుకు అక్కడ సరైన ఆధారం కూడా కనిపించడం లేదు. ఇక రజనీకాంత్ ని పోలిన మరో వ్యక్తి గురించి ఇంతకుముందు కథనాలు వచ్చాయి. అలాంటి ఒక వ్యక్తికి సంబంధించిన వీడియో కావొచ్చు కదా? అనే సందేహాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఇది తప్పుడు వీడియో.. లైక్ ల కోసం తప్పుడు ప్రచారం అంటూ కొట్టిపారేస్తున్నారు. కొందరు కన్ఫ్యూజన్ తో తలైవా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన `కూలీ` ఈనెల 14న విడుదలవుతోంది. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించగా, పలువురు అగ్ర హీరోలు అతిథి పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే.