Advertisementt

సందీప్‌కిషన్‌ క్లాప్‌తో హ్రీం

Thu 31st Jul 2025 03:25 PM
hreem movie  సందీప్‌కిషన్‌ క్లాప్‌తో హ్రీం
Hreem movie Opening సందీప్‌కిషన్‌ క్లాప్‌తో హ్రీం
Advertisement
Ads by CJ

పవన్‌ తాత, చమిందా వర్మ జంటగా నటిస్తోన్న నూతన చిత్రం హ్రీం. రాజేశ్‌ రావూరి ఈ చిత్రంతో దర్శకునిగా మారనున్నారు. శివమ్‌ మీడియా పతాకంపై శ్రీమతి సుజాత సమర్పిస్తున్న ఈ చిత్రానికి శివమల్లాల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ప్రముఖ హీరో సందీప్‌కిషన్‌ క్లాప్‌నివ్వగా నటులు అలీ, బెనర్జీ, తెలుగు రాష్ట్రాల్లో టాప్‌ ఆడిటర్‌గా ఉన్న విజయేంద్రరెడ్డి, సినీజోష్ అధినేత రాంబాబు పర్వతనేని దర్శకుడు రాజేశ్‌కి స్క్రిప్ట్‌ని అందించారు. నటులు రాజీవ్‌ కనకాల కెమెరా స్విఛాన్‌ చేశారు.

చిత్ర ప్రారంభోత్సవం తర్వాత సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ– నా తొలి చిత్రం నుండి ఈ చిత్ర నిర్మాతతో పరిచయం ఉంది. నాకున్న అతికొద్ది మంది మీడియా ఫ్రెండ్స్‌లో శివ మల్లాల ఎంతో ముఖ్యుడు. ఆయన తీస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు.

నటుడు అలీ మాట్లాడుతూ – హ్రీం చిత్ర నిర్మాతలు శివమల్లాల, సుజాతలు నాకు కుటుంబ సభ్యులు. వారు నిర్మించ తలపెట్టిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నా అన్నారు.

నటుడు బెనర్జీ మాట్లాడుతూ– ఈ సినిమాలో నేను చాలా మంచి పాత్రలో నటిస్తున్నా. తమ్ముడు శివ నాకు ఎంతో ఆప్తుడు. హీరో, హీరోయిన్‌ పవన్, చమిందా, దర్శకుడు రాజేశ్‌కి ఆల్‌ ది బెస్ట్‌ అన్నారు.

రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ– ఈ చిత్రంలో చాలా కీలకమైన పాత్ర పోసిస్తున్నాను. హ్రీం చిత్ర హీరోయిన్‌ చమిందా వర్మ నటే కాదు. దుబాయ్‌ నుండి తెలుగులో నటించటానికి వచ్చిన తెలుగమ్మాయి. ఆమె డాక్టర్‌ కూడా. ఈ చిత్రంలో నటిస్తున్న పవన్‌ తాతా, దర్శకుడు రాజేశ్‌ నాకు ముందునుండి పరిచయం ఉంది. వారిద్దరికి ఎంతో టాలెంట్‌ ఉంది. ఇప్పుడు నాకు 50 ఏళ్లు. నాకు 25 ఏళ్లున్నప్పటినుండి ‘హ్రీం’ చిత్ర నిర్మాత శివ మల్లాల నాకు తెలుసు. ఈ సినిమా పెద్ద స్థాయిలో విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.

సినిమా ప్రారంభోత్సవంలో దర్శక–రచయిత జనార్థనమహర్షి, నిర్మాత కె.బాబురెడ్డి, తమిళ నిర్మాత జి.సతీష్‌ కుమార్, ట్రెండింగ్‌లవ్‌ దర్శకుడు హరీష్‌ నాగరాజ్, బహిష్కరణ చిత్ర దర్శకుడు ముకేష్‌ ప్రజాపతి, ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ బెజవాడ బేబక్క, వనిత, శ్రీవాణి త్రిపురనేని తదితరులు పాల్గొన్నారు.

కథ–కథనం–దర్శకత్వం – రావూరి రాజేష్‌, నిర్మాత– శివ మల్లాల, సమర్పణ- శ్రీమతి మల్లాల సుజాత. 

కెమెరా– అరవింద్, సంగీతం– మార్కస్‌.యం, ఎడిటర్‌– ప్రణీత్‌ కుమార్, కళ– సుధీర్‌ మాచర్ల క ఫేమ్‌, వీ.ఎఫ్‌.ఎక్స్‌ డైరెక్టర్‌– రాజ్‌ పవన్‌ కొమ్మోజు, సౌండ్‌ డిజైనర్‌– సాయి మనీంధర్, డి.ఐ– ఎస్‌.జె కార్తీక్‌ డి.ఎఫ్‌.టెక్‌, పి.ఆర్‌.వో– మూర్తి మల్లాల.

Hreem movie Opening:

Hreem opens with Sundeep Kishan clap

Tags:   HREEM MOVIE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ