నందమూరి వారసుడు, నటసింహ బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశంపై నందమూరి అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. కానీ మోక్షజ్ఞ హీరోగా ఇచ్చే క్షణాలు ఇంకా వచ్చినట్టుగా లేదు. తాజాగా బాలకృష్ణ కొడుకు విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది.
అదే ఆదిత్య 369 కి సీక్వెల్ గా బాలకృష్ణ చెయ్యబోయే ఆదిత్య 999 ద్వారానే మోక్షజ్ఞ ను తెరకు పరిచయం చెయ్యాలని అనుకుంటున్నారట. ముందు నుంచి ఆదిత్య 999 లో తనతో పాటుగా మోక్షజ్ఞ కూడా ఉండేలా ప్లాన్ చేసుకున్న బాలయ్యకు ఆ చిత్రం ద్వారానే కుమారుడిని సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇప్పించాలని డిసైడ్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి
దాని కోసం దర్శకుడు క్రిష్ ను రంగంలోకి దించారని, బాలయ్య-క్రిష్ కలయికలో ఓ మూవీ వస్తుంది అనే టాక్ వినిపించడం మాత్రమే కాదు క్రిష్ ఆదిత్య 999 స్క్రిప్ట్ పై కూర్చున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో బాలయ్య త్రిపాత్రాభినయం చెయ్యబోతున్నారని అంటున్నారు. మోక్షజ్ఞ ను సోలో హీరోగా పరిచయం చేయించడం కంటే తన సినిమాలో భాగం చేసి ఆ తర్వాత ఒంటరిగా సినిమాలు చేయించడానికి బాలయ్య ఫిక్స్ అయ్యారని సమాచారం.