విజయ్ దేవరకొండ లేటెస్ట్ పాన్ ఇండియా ఫిలిం కింగ్ డమ్. రేపు గురువారం జులై 31 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పలుమార్లు వాయిదాలు పడుతూ చివరికి జులై 31 న పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న కింగ్ డమ్ చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసారు.
అయితే కింగ్ డమ్ పై ఎంత బజ్ ఉంది, ప్రేక్షకులు కింగ్ డమ్ కోసం ఎంత ఎదురు చూస్తున్నారు అనే విషయంలో విజయ్ దేవరకొండ అభిమానులకు నిరాశ పరిచే ఫీడ్ బ్యాక్ కనిపిస్తుంది. వీరమల్లు ప్లాప్ అవడంతో అందరికి కింగ్ డమ్ పైనే హోప్స్ ఉంటాయి అనుకున్నారు. ముందు నుంచి కింగ్ డమ్ స్పెషల్ ప్రీమియర్స్ అని వినిపించినా, వీరమల్లు స్పెషల్ ప్రీమియర్స్ తో జరిగిన డ్యామేజ్ తో మేకర్స్ వెనక్కి తగ్గారు. కింగ్ డమ్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.
అందులో వీక్ మిడిల్ లో కింగ్ డమ్ విడుదలవుతుంది. టాక్ బావుంటే కింగ్ డమ్ చూడొచ్చులే అని చాలామంది ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. అందులో విజయ్ దేవరకొండ కు వరస వైఫల్యాలు, కింగ్ డమ్ కంటెంట్ కూడా డ్రై గా కనిపించడం అన్ని కింగ్ డమ్ పై బజ్ లేకపోవడానికి కారణమయ్యాయనే మాటలు వినబడుతున్నాయి.
మరి సినిమా విడుదలై హిట్ టాక్ వస్తే తప్ప కింగ్ డమ్ పై క్రేజ్ పెరగదు. మరికొని గంటల్లో కింగ్ డమ్ అసలు సత్తా ఏమిటో తెలిసిపోతుంది.