పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అందులోను ఏపీ ప్రభుత్వంలో స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నారు. ఇటు సినిమాల పరంగా సినిమా హిట్ ప్లాప్ తో ఆయనకు పెద్దగా సంబంధం ఉండదు. ఆడితే నిర్మాతలు సేఫ్, లేదంటే పవన్ శాయశక్తులా సినిమాని నిలబెట్టేందుకు కష్టపడతారు. ప్రస్తుతం హరి హర వీరమల్లు విషయములో అదే జరిగింది. ఆయన నిర్మాత కోసం ఎప్పుడు లేని విధంగా సినిమాను ప్రమోట్ చేసారు.
హరి హర వీరమల్లు కి సూపర్ హిట్ టాక్ పడలేదు. మొదటి వీకెండ్ లో టికెట్ బుకింగ్స్ కాస్త హరి హర వీరమల్లుకు కలిసొచ్చినా సోమవారం నుంచి వీరమల్లు అసలు సిసలు అగ్ని పరీక్షకు సిద్దమవ్వాల్సిందే. అయితే ఇక్కడే బ్లూ మీడియా పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి తన పార్టీ కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేసారు. సినిమాని ఆడించేందుకు తమ శాయశక్తులా కృషి చెయ్యాలి అని ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసారు.
అవసరమైతే డబ్బులు పెట్టుకుని పక్కనోళ్ళను థియేటర్స్ కు తీసుకెళ్లాలి, అలా హరి హర వీరమల్లు సినిమా థియేటర్స్ లో ప్రేక్షకులు కనిపించాలి. అందుకే జనసేన పార్టీనే ఏకంగా పవన్ రంగంలోకి దించుతున్నారు.. అంటూ పవన్ కళ్యాణ్ ఆలోచనలను బ్లూ మీడియా చదివేస్తుంది.
అంతేకాదు అప్పుడే పవన్ ఇమేజ్ ఇండస్ట్రీలో పెరుగుతుంది. అందుకే పవన్ ఇలా చేస్తున్నరంటుంది. పవన్ ఏమనుకుంటున్నారో తెలియదు కానీ.. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లుని ఆడించేందుకు జనసేనను రంగంలోకి దించుతున్నారంటూ కథనాలు వండి వారుస్తుంది.