పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-సందీప్ రెడ్డి వంగ కాంబోలో మొదలయ్యే మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్ స్టార్ట్ అయ్యే క్షణం గురించి ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూడని క్షణం లేదు. కానీ ఏడాది కాలంగా సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ అప్ డేట్స్ ఇవ్వడమే కాదు ప్రభాస్ రాజా సాబ్, ఫౌజీ చిత్రాల షూటింగ్స్ లో బిజీ అవడంతో స్పిరిట్ షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది.
తాజాగా సందీప్ రెడ్డి వంగా ను కింగ్ డమ్ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ స్పిరిట్ అప్ డేట్ ఇవ్వకపోతే నన్ను అందరూ సోషల్ మీడియాలో తిట్టుకుంటారు అనగానే సందీప్ వంగ నవ్వుతూ.. ఏం పర్లేదు అడుగు అంటూ అనగానే విజయ్ స్పిరిట్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అంటే దానికి వంగ మాట్లాడుతూ..
స్పిరిట్ షూటింగ్ సెప్టెంబర్ ఎండ్ లో స్టార్ట్ అవుతుంది.. నాన్ స్టాప్ గా కొట్టాలనేదే ఐడియా అంటూ స్పిరిట్ అప్ డేట్ ఇచ్చారు. దీన్ని బట్టి ప్రభాస్ పూర్తిగా మిగతా సినిమా షూటింగ్స్ నుంచి రివీల్ అవ్వగానే స్పిరిట్ షూటింగ్ మొదలు పెట్టి ప్రభాస్ ని స్పిరిట్ సెట్ లోనే లాక్ చేసే ప్లాన్ లో సందీప్ వంగ ఉన్నారన్నమాట.