హీరోయిన్స్ అంటే నాజూగ్గా ఉండేందుకు ఫుల్ డైట్ ని ఫాలో అవుతూ ఉంటారు. వర్కౌట్స్, జిమ్, యోగా, డైట్ ని మైంటైన్ చేస్తూ గ్లామర్ గానే కాదు నాజూగ్గా కనిపించేందుకు నానా కష్టాలు పడతారు. ఇష్టమైన తిండి తినలేరు. కొంతమంది మాత్రం చీట్ మీల్ అంటూ వారంలో ఒకరోజు అన్ని తినేసినా.. కొంతమంది వారం మొత్తం ఒకే రకమయిన డైట్ ని ఫాలో అవుతారు.
తాజాగా సమంత డైట్ సీక్రెట్ ని రివీల్ అయ్యింది. ఒకప్పుడు తన ఫ్రెండ్ వెన్నెల కిషోర్ ని కలిస్తే ఫుడ్ గురించి డిస్కర్స్ చేసుకునే సామ్, ఫిష్ లేకుండా తినేదికాదట. అందులోను సాల్మన్ ఫిష్ ఇష్టపడే సమంత ఇప్పుడు అంటే మాయోసైటిస్ బారిన పడిన తర్వాత తన డైట్ ని టోటల్ గా చేంజ్ చేసేసిందట. ఎప్పుడు ఫిట్ నెస్ కోసం జిమ్ లో వర్కౌట్స్ చేసే సమంత అందుకోసం స్ట్రిక్ట్ గా డైట్ ఫాలో అవుతుందట.
సామ్ యాంటీ ఇన్ ఫ్లమెంటరీ డైట్ ను ఫాలో అవుతుందంట. ఆ డైట్ లో కేవలం ఆకు కూరలు, క్యాబేజీ లాంటి కూరగాయాలు, వాటికి తోడు పసుపు, మరిన్ని హెల్తీ ఫ్యాట్ కలిగిన పదార్థాలతో చేసిన వంటకాలను తింటుందంట. ఆకూ కూరల్లో ఆమె పాలకూర అస్సలు తీసుకోదట. కొద్ది కాలంగా ఒక్క రోజు కూడా మిస్ చేయకుండా, వేరే వంటకాలను రుచి చూడకుండా ఒకే స్టైల్ డైట్ ను ఆమె పాలో అవుతందని తెలుస్తోంది.
అవుట్ డోర్ షూట్ కి వెళ్లినా ఆమె పర్సనల్ స్టాఫ్ ఆమె కోసం ఆమె తీసుకునే డైట్ ను ప్రిపేర్ చేసి ఇస్తారట. అందుకోసం ఆమె టీమ్ లోని తన అసిస్టెంట్ ఆమె తినే ఆహారాలను ప్రిపేర్ చెయ్యడం నేర్చుకున్నాడట. సో సమంత డైట్ సీక్రెట్ ఇదే అన్నమాట.