Advertisementt

పవన్ కి బాబు విషెస్ - పవన్ రియాక్షన్

Thu 24th Jul 2025 09:37 AM
chandrababu  పవన్ కి బాబు విషెస్ - పవన్ రియాక్షన్
Chandrababu best wishes to Pawan Kalyan పవన్ కి బాబు విషెస్ - పవన్ రియాక్షన్
Advertisement
Ads by CJ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ సినిమా విడుదల సందర్భంగా.. 

పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ప్రేక్షకులు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న #HariHaraVeeraMallu చిత్రం విడుదల సందర్భంగా శుభాకాంక్షలు. మిత్రులు పవన్ కళ్యాణ్ గారు... చారిత్రాత్మక కథాంశంతో రూపొందించిన చిత్రంలో తొలిసారి నటించిన హరిహర వీరమల్లు సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే...  సమయాన్ని సర్దుబాటు చేసుకుని నటించిన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. @PawanKalyanఅంటూ ట్వీట్ చేసారు. 

చంద్రబాబు విషెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. 

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారితో గత పదేళ్లలో పలుమార్లు సమావేశమైనా ఎప్పుడూ సినిమాల ప్రస్తావన రాలేదు. ఈ రోజు ‘హరిహర వీరమల్లు’ గురించి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆప్యాయంగా అందించిన ఆకాంక్ష– ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఆ మాటలు విజయ సంకేతాలు. నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే సినిమాలో నటించే వెసులుబాటు ఇచ్చినందుకు... చిత్ర విజయాన్ని ఆకాంక్షించినందుకు శ్రీ @ncbn గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.. అంటూ చంద్రబాబు కి పవన్ థాంక్స్ చెప్పారు. 

Chandrababu best wishes to Pawan Kalyan:

Cm Chandrababu Naidu Best Wishes To Pawan Kalyan Hari Hara Veeramallu

Tags:   CHANDRABABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ