Advertisementt

అగ్ర‌నిర్మాత షాకింగ్ మేకోవ‌ర్

Thu 24th Jul 2025 09:31 AM
boney kapoor  అగ్ర‌నిర్మాత షాకింగ్ మేకోవ‌ర్
Top producer shocking makeover అగ్ర‌నిర్మాత షాకింగ్ మేకోవ‌ర్
Advertisement
Ads by CJ

అత‌డు హిందీ చిత్ర‌సీమ‌లో అగ్ర నిర్మాత‌. తెలుగులో ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా సినిమా తీసారు. త‌న కుమార్తెల‌ను టాలీవుడ్‌కి ప‌రిచ‌యం చేస్తూ, అంద‌రి దృష్టిలో ఉన్నారు. అయితే ఈ ప్ర‌ముఖ నిర్మాత ఇంత‌కుముందు హెవీ వెయిట్ తో క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచేవాడు. కానీ ఇప్పుడు అనూహ్యంగా స్లిమ్ గా మారిపోయి అంద‌రికీ మ‌రోసారి షాకిచ్చాడు. ఈసారి ఏకంగా 26 కేజీల బ‌రువు త‌గ్గిపోయాడు. ఇది నిజానికి షాకింగ్ మేకోవ‌ర్.

ఈ నిర్మాత ఎవ‌రో కాదు.. బోనీక‌పూర్. అత‌డు గ‌తంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా `పింక్` రీమేక్ `వ‌కీల్ సాబ్`ని తెర‌కెక్కించారు. మ‌ళ్లీ టాలీవుడ్ లో సినిమాలు తీయాల‌నుకుంటున్నార‌ని స‌మాచారం. అలాగే త‌న పెద్ద‌ కుమార్తె జాన్వీక‌పూర్ ని టాలీవుడ్ కి ప‌రిచయం చేసారు. రెండో కుమార్తె ఖుషీని కూడా తెలుగు చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌యం చేయాల‌నుకుంటున్నారు. దీంతో బోనీ క‌పూర్ ఇటీవ‌ల తెలుగు చిత్ర‌సీమ ప్ర‌ముఖుల‌తోను స‌న్నిహితంగా మెలుగుతున్నారు.

ఇక బోనీ క‌పూర్ త‌న అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు క‌చ్ఛిత‌మైన ఆహార నియ‌మాల‌ను పాటించి 26 కేజీల బ‌రువు త‌గ్గ‌డం విశేషం. అతడు రెగ్యుల‌ర్ ఆహారంగా స‌లాడ్ లు, సూప్ లు, ర‌సం, పండ్లు, పండ్ల ర‌సాల‌ను మాత్ర‌మే ఆశ్ర‌యించాన‌ని అన్నాడు. ఉద‌యం ఆహారంలో పండ్లు, పండ్ల ర‌సాలు, జ‌వ‌ర్ రోటీ వంటి వాటిని మాత్ర‌మే తీసుకున్నానని తెలిపాడు. ప్ర‌స్తుతం బోనీ స్లిమ్ గా స్టైలిష్ గా మారిన ఫోటోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి. అన‌వ‌స‌ర‌మైన పార్టీలు విందుల జోలికి వెళ్ల‌కుండా, నిజాయితీగా కృషి చేస్తే జిమ్ లో హార్డ్ వ‌ర్క్ తో ప‌ని లేకుండా బ‌రువు త‌గ్గొచ్చ‌ని ఈ సీనియ‌ర్ నిర్మాత నిరూపించారు.

Top producer shocking makeover:

Boney Kapoor shocking makeover

Tags:   BONEY KAPOOR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ