బెట్టింగ్ యాప్ ప్రమోహన్స్ లో భాగంగా పలువురు సెలబ్రిటీస్ కి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్ లకు ఈడీ నోటీసులు జారీ చేసారు. జులై 23 న విచారణకు రమ్మని రానాకు నోటీసులు ఇవ్వగా.
హీరో రానా విచారణకు హాజరయ్యేందుకు గడువు కావాలని, తను షూటింగ్ విషయంగా విచారణకు హాజరు కాలేను అని ఈడీని కోరారు. ఈ నేపథ్యంలో ఈడీ రానా విచారణ కోసం మరో తేదీని ఖరారు చేసింది. ఆగస్టు 11న తప్పకుండా విచారణకు హాజరు కావాలని తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది.
మరోవైపు మంచు లక్ష్మి కూడా తనకు విచారణకు హాజరు కావడానికి సమయం కోరినట్లుగా తెలుస్తుంది.