తిరువూరు టీడీపీ ఎమ్యెల్యే కొలికపూడి ఎప్పటికప్పుడు కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా తయారవుతున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా చేయడమే కాదు, టీడీపీ పార్టీని తరచూ ఇబ్బంది పెట్టే ఎమ్యెల్యే కొలికపూడి మరోమారు టీడీపీ కి పెద్ద తలనొప్పే తెచ్చిపెట్టారు. అది వైసీపీ కీలక నేత రామచంద్రారెడ్డి ని కలవడం హాట్ టాపిక్ అయ్యింది.
ఏపీ లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కోర్టు మిథున్ రెడ్డికి ఒక పూట ఇంటి భోజనం అందించేందుకు ఆదేశాలు జారీ చెయ్యడంతో ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు రాజమండ్రి జైలు వద్దకు భోజనం తీసుకువచ్చారు.
ఆయన మిథున్ రెడ్డి కి భోజనం ఇచ్చి జైలు నుంచి బయటికొస్తున్న సమయంలో కొలికపూడి.. ఆయనను కలవడం హాట్ టాపిక్ అయ్యింది. గెలిచినా సరే తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కొలికపూడి ఇపుడు వైసీపీ కీలక నేతలను కలిసేందుకు ప్రయత్నిస్తుండటం ఆసక్తికరంగా మారింది..