రోంత్ (మలయాళం) ఓటీటీ రివ్యూ
మలయాళంలో తెరకెక్కుతున్న క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ కి తెలుగులో విపరీతమైన గిరాకీ ఉంటుంది. అందులోను మలయాళంలో హిట్ అయిన సస్పెన్స్ థ్రిల్లర్స్ కు ఓటీటీ లో ప్రత్యేకమైన అభిమానులు ఉంటున్నారు. మలయాళంలో ఏదైనా సినిమా హిట్ అయ్యింది అనగానే అదెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఆ చిత్రాలు ఇతర భాషల్లోనూ డబ్ అవడం ప్లస్ అవుతుంది. అందుకే ప్రతి వాళ్ళు ఓటీటీలో ఆయా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ కోసం ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు అలాంటి కోవలోకే ఓ పోలీస్ స్టోరీ వచ్చింది. అదే రోంత్ జియో ప్లస్ హాట్ స్టార్ నుంచి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. జూన్ లో మలయాళ థియేటర్స్ లో విడుదలైన రోంత్ ఇప్పుడు జియో ప్లస్ హాట్ స్టార్ లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
రోంత్ స్టోరీ రివ్యూ:
ధర్మశాల లో నైట్ పెట్రోలింగ్ వాహనంతో మొదలైన కథలో SI గా యోహన్నా, కానిస్టేబుల్ దిన్నాథ్ లు సిటీ మొత్తం తిరుగుతున్న సమయంలో ఓ చోట లవర్స్ లేచిపోవడం, మరోచోట ఓ సైకో కన్న బిడ్డనే డబ్బా కింద దాచడం, మరోచోట ఒక ఇంట్లో సూసైడ్, చివరిగా అనుకోని ఓ మరణం SI గా యోహన్నా, కానిస్టేబుల్ దిన్నాథ్ లను ఎలాంటి సమస్యలోకి నెట్టింది అనేదే రోంత్ సింపుల్ స్టోరీ.
రోంత్ ఎఫర్ట్స్:
SI గా యోహన్నా పాత్రలో దిలీష్ పోతన్, కానిస్టేబుల్ దిన్నాథ్ పాత్రలో రోషన్ మాథ్యూ పోలీస్ అంటే ఇలానే ఉంటారా అనిపించేలా పెరఫార్మ్ చేసారు. దిలీష్ పోతన్ పోలీస్ గా, భార్యను చంటి పిల్లలా చూసుకునే ఫ్యామిలీ మ్యాన్ గా అద్భుతంగా ఆకట్టుకున్నారు. డ్రైవర్ గా, కానిస్టేబుల్ పాత్రలో, ఫ్యామిలీ ఎమోషన్స్ లో రోషన్ మాథ్యూ పర్ఫెక్ట్ గా నటించారు. సినిమాలో ఈ రెండు కేరెక్టర్స్ మాత్రమే కీలకం. మిగతా పాత్రలన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
సాంకేతికంగా మనేశ్ మాధవన్ ఫొటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధానమైన బలం అని చెప్పాలి. సినిమా మొత్తం నైట్ లో జరిగినా ఆయా లొకేషన్స్ ను నైట్ ఎఫెక్ట్స్ తో అద్భుతంగా చూపించారు. అలాగే అనిల్ జాన్సన్ BGM కూడా ఆకట్టుకుంటుంది. ప్రవీణ్ ఎడిటింగ్ ఓకె ఓకె. దర్శకుడు షాహీ కబీర్ రోంత్ చిత్రాన్ని సాలిడ్ గా తెరకెక్కించారు. కాకపోతే స్క్రీన్ ప్లేలో వేగం లేదు. కథ నిదానంగా నడుస్తూ స్లోగా వెళుతూ ఉంటుంది. దర్శకుడు మలయాళ హిట్ చిత్రం నయట్టు లా రోంత్ క్లైమాక్స్ ను కాస్త డిఫరెంట్ గా చూపించినా అది మళయాళీలకు నచ్చేస్తుంది కానీ.. తెలుగు ప్రేక్షకులు డైజెస్ట్ చేసుకోలేరు.
రోంత్ స్క్రీన్ ప్లే:
నైట్ ఎఫెక్ట్ లోనే జరిగే కథ రోంత్. రోంత్ అంటే గస్తీ. నైట్ పెట్రోలింగ్ కి వెళ్లిన ఇద్దరు పోలీసులకు ఎదురైన అనుభవాలను కథగా మలిచారు దర్శకుడు. SI కి కానిస్టేబుల్ కి ఫ్యామిలీస్ ని ముడిపెట్టి కథ నడిపించారు. పోలీస్ వృత్తిలో తన 25 ఏళ్ళ అనుభవాన్ని కాస్త దూకుడు స్వభావం ఉన్న కానిస్టేబుల్ కి గుర్తు చేస్తూ.. SI ఆ కానిస్టేబుల్ ను షైన్ చేసేపనిలో ఒక నైట్ లో ధర్మస్థలిలో జరిగే సంఘటనలను చూపించారు. లవర్స్ లేచిపోవడం దగ్గర నుంచి ఓ కుటుంబంలో మహిళ ఆత్మహత్య, అలాగే కుటుంబ వివాదాలను చక్కబెట్టే విధానం, జ్వరంతో బాధపడుతున్న కానిస్టేబుల్ కుమార్తెను ఆసుపత్రిలో జాయిన్ చెయ్యడం, అలాగే కొన్ని సన్నివేశాలను ఎమోషనల్ గా చూపించిన దర్శకుడు క్లైమాక్స్ ను మాత్రం వుహించని విధంగా ముగించడం షాకిస్తుంది. నిజాయితీగా ఉండడమే ముఖ్యం కాదు, అందుకు తెలివి ని కూడా జోడించాలనే మెసేజ్ ను దర్శకుడు తెలివిగా చూపించాడు.
రోంత్ ఎనాలసిస్ :
దర్శకుడు షాహీ కబీర్ నయట్టు చిత్రానికి ఇన్స్పైర్ అయ్యి ఈ రోంత్ చిత్రాన్ని తెరకెక్కించరా అనే అనుమానం రోంత్ క్లైమాక్స్ చూస్తే తెలుస్తుంది. రోంత్ క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ఉంటుంది.. కానీ అలాంటి క్లైమాక్స్ లు తెలుగు ఆడియన్స్ అంతగా కనెక్ట్ అవరు. కానీ దర్శకుడు ప్రయత్నం మాత్రం మెచ్చుకోదగినది, అలాంటి క్లైమాక్స్ చాలారోజులు మదిలో మెదులుతుంది.