Advertisementt

చెన్నై అపోలో ఆసుపత్రిలో తమిళనాడు సీఎం

Mon 21st Jul 2025 05:02 PM
stalin  చెన్నై అపోలో ఆసుపత్రిలో తమిళనాడు సీఎం
Tamil Nadu CM in Chennai Hospital చెన్నై అపోలో ఆసుపత్రిలో తమిళనాడు సీఎం
Advertisement
Ads by CJ

తమిళనాడు ముఖ్యమంత్రి చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరడం డీఎంకే శ్రేణులను ఆందోళనకు గురి చేసింది. స్టాలిన్ స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ఆయనను హుటాహుటిన చెన్నై అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేసారు. ఈరోజు సోమవారం ఉదయం ఆయన మార్నింగ్ వాక్ చేస్తుండగా... కళ్లు తిరిగినట్టు అనిపించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలుస్తుంది. 

స్టాలిన్ ను ఆసుపత్రిలో చేర్పించే సమయంలో ఆయన కుమారుడు ఉదయనిధి ఆయన వెంట ఉన్నారు. తాజాగా అపోలో మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ స్టాలిన్ హెల్త్ కండిషన్ పై స్పందిస్తూ... అయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఆరోగ్యపరంగా స్టాలిన్ కు ఎలాంటి ఇబ్బంది లేదని, అవసరమైన వైద్య పరీక్షలు స్టాలిన్ కు నిర్వహించామని తెలిపారు.  

స్టాలిన్ అనారోగ్య వార్తలతో ఆందోళన పడిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు స్టాలిన్ ఆరోగ్యంగా ఉన్నారని తెలిసి రిలాక్స్ అవుతున్నారు. 

Tamil Nadu CM in Chennai Hospital:

CM Stalin hospitalised after giddiness during morning walk

Tags:   STALIN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ