గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పెద్ది కోసం తన బెస్ట్ ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఈ చిత్రం కీలకమైన, లెన్తీ షెడ్యూల్ రేపు ప్రారంభం కానుంది. ఈ కీలకమైన ఫేజ్ కి ముందు రామ్ చరణ్ ఈ పాత్ర కోసం నెవర్ బిఫోర్ అవతార్ లోకి మారారు. పవర్‌ఫుల్ లుక్‌కి ఫిట్ అవడానికి ఫిజికల్ గా ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు.
కంటిన్యూగా కసరత్తులు చేస్తూ, డెడికేషన్‌తో ఫిజిక్‌ను సాలిడ్ గా తీర్చిదిద్దుకున్నారు. జిమ్‌లో తీసిన ఫోటో చూస్తే... రగ్గ్డ్ బీర్డ్, ముడివేసి వేసిన జుట్టు, స్ట్రాంగ్ బాడీతో లుక్ అదిరిపోయింది. ఈ మార్పు కేవలం లుక్ కోసమే కాదు, పాత్రపై అతని అంకితభావానికి నిదర్శనం. గ్రీక్ గాడ్ లా కనిపిస్తున్న చరణ్ రెగ్యులర్ మోడ్ వదిలేసి బీస్ట్ మోడ్‌లోకి ఫుల్ గా మారిపోయారు.
చరణ్ పుట్టిన రోజు మార్చి 27న విడుదల కానున్న పెద్ది, తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులలో ఒకటిగా ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు చరణ్ ఇంటెన్స్ ట్రైనింగ్ చేస్తుండడంతో, ఫ్యాన్స్ లో చాలా క్యురియాసిటీ నెలకొంది.