పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు ఈ నెల 24 న విడుదల కాబోతుంది. వీరమల్లు రిలీజ్ ప్రమోషన్స్ లో పవన్ తప్ప మిగతా టీం అంటే దర్శకుడు జ్యోతి కృష్ణ, నిర్మాత రత్నం, హీరోయిన్ నిధి అగర్వాల్ లు హడావిడిగా ఉన్నారు. మరోపక్క హరి హర వీరమల్లు బిజినెస్ పై రోజుకో న్యూస్ హైలెట్ అవుతుంది.
అయితే వీరమల్లు మరో ఐదు రోజుల్లో విడుదల కాబోతున్న సమయంలో నైజాం లో వీరమల్లు మేకర్స్ కు టెన్షన్ పెట్టే వార్త ఒకటి బయటికి వచ్చింది. హరి హర వీరమల్లుకు షాకిచ్చేలా నైజాం బయ్యర్లు ఏఎం రత్నం కి సరిగ్గా టైమ్ చూసి దెబ్బేసారు. నిర్మాత ఏ ఎం రత్నం గత సినిమాలు ఆక్సిజన్, అప్పుడెప్పుడో చేసిన బంగారం, ముద్దుల కొడుకు సినిమాల తాలూకా బకాయిలు చెల్లించాల్సి ఉందని...
ఆ బకాయిలను నైజాంలో హరిహర వీరమల్లు రిలీజ్ కి ముందే సెటిల్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ఇన్ని రోజులుగా కామ్ గా రత్నం ను కదిలించని నైజాం డిస్ట్రిబ్యూటర్స్ సరిగ్గా హరి హర వీరమల్లు విడుదల ముందు ఇలాంటి ట్విస్ట్ ఇవ్వడం వీరమల్లు కు నైజాం టెన్షన్ స్టార్ట్ అయినట్లు అయ్యింది.