గ్లామర్ గర్ల్ రాశి ఖన్నా కు లక్కీ ఛాన్స్ తగిలింది. ఇప్పటివరకు టాలీవుడ్ లో బిగ్ ఆపర్చునిటీ రాని రాశి ఖన్నాకు ఇప్పుడు అలాంటి ఓ భారీ బడ్జెట్ మూవీలో ఛాన్స్ తగిలింది. స్టార్ హీరోల అవకాశాల కోసం వెయిట్ చేస్తున్న రాశి ఖన్నా కు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఛాన్స్ రావడంతో ఎగిరి గంతేస్తుంది.
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల హీరోయిన్. ఈ చిత్రంలో మరో హీరోయిన్ కి ఛాన్స్ ఉండడంతో హరీష్ శంకర్ రాశి ఖన్నాను సెలక్ట్ చెయ్యడమే కాదు.. రాశి ఖన్నా ఉస్తాద్ సెట్ లో జాయిన్ అయినట్లుగా తెలుస్తుంది. టాలీవుడ్ లో అవకాశాలు లేని రాశి ఖన్నా కి పవన్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా అవకాశం రావడం లక్కీ కాక ఇంకేంటి.
ఇక పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండడంతో హరీష్ శంకర్ చకచకా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ని పూర్తి చేస్తున్నారు. శ్రీలీల కూడా ఉస్తాద్ కి అందుబాటులో ఉంటుంది. దానితో షూటింగ్ త్వరగా చక్కబెట్టేస్తున్నారు హారిష్.