ఫిష్ వెంకట్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆయన కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నట్లుగా, కొంతమంది నటులు ఫిష్ వెంకట్ ఆసుపత్రి ఖర్చులకు సహాయం చేసినట్లుగా ఛానల్స్ లో వార్తలు రావడం, ఆతర్వాత ఫిష్ వెంకట్ కుమార్తె నటుడు ప్రభాస్ మేనేజర్ కాల్ చేసి మీకు కిడ్నీ డోనర్ దొరికైట్ కిడ్నీ మార్పిడి కి అయ్యే 50 లక్షల ఖర్చు ప్రభాస్ భరిస్తానన్నారు అని ఆమె చెప్పింది.
దానితో పలు ఛానల్స్, వెబ్ సైట్స్ ప్రభాస్ దాతృత్వాన్ని కొనియాడాయి. అయితే అసలు ప్రభాస్ మేనేజర్ అంటూ ఫిష్ వెంకట్ కుమార్తెకు ఎవరూ ఫోన్ చెయ్యలేదని, ఆ వచ్చిన కాల్ రాంగ్ కాల్ అని తేలడంతో ప్రభాస్ సహాయం ఫేక్ అని తేలిపోయింది. ఆతర్వాత ఫిష్ వెంకట్ కండిషన్ సీరియస్ గా మారింది.
గత రాత్రి ఫిష్ వెంకట్ కన్ను మూసారు. ఈరోజు శనివారం ఆయన భౌతిక కాయానికి నివాళుల అర్పించేందుకు వచ్చిన సహచర నటులు ప్రభాస్ 50 లక్షలు ఇస్తారనే ప్రచారంపై మాట్లాడారు. ఫిష్ వెంకట్ అన్న ఎలాగూ లేరు, ఆ 50 లక్షల సహాయమేదో ప్రభాస్ చేస్తే వదినమ్మకు అండగా ఉంటుంది, ప్రభాస్ 50 లక్షల సహాయం చేస్తే వెంకట్ భార్యకు హెల్ప్ అవుతుంది అంటూ మీడియాతో మాట్లాడం హైలెట్ అయ్యింది.