ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరి హర వీరమల్లు రేపు శుక్రవారం విడుదల కాబోతుంది. అయితే హరి హర వీరమల్లు భారీ బడ్జెట్ మూవీ కావడంతో నిర్మాత ఏ ఏం రత్నం వీరమల్లు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి కోసం ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించారు.
వీరమల్లు నిర్మాత రత్నం రిక్వెస్ట్ మేరకు హరి హర వీరమల్లు కు టికెట్ రేట్లు పెంచుకునేలా ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అప్పర్ క్లాస్ లో 150 వరకు, మల్టీ ఫ్లెక్స్ లో 200 వరకు పెంపుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంతేకాదు పెరిగిన టికెట్ రేట్లు 10రోజులు వరకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసారు. అయితే ఏపీలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఏ సినిమాకైనా రేట్లు పెంచుకునే వెసులుబాటు లభిస్తుంది, అలానే వీరమల్లుకు వర్తించింది.
టికెట్ రేట్ల పెంపులో నిక్కచ్చిగా ఉంటానని చెబుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో హరి హర వీరమల్లు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇస్తుందా, లేదా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.