కన్నడ టాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేసిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ చిత్రం పాన్ ఇండియా మార్కెట్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పృథ్వీ రాజ్ సుకుమారన్ - ప్రభాస్ స్నేహితులుగా తెరకెక్కిన సలార్ పార్ట్ 1 ఎప్పుడో రిలీజ్ అయ్యింది. పార్ట్ 2 షూటింగ్ కూడా గత ఏడాది మే లోనే మొదలవుతుంది అన్నా.. అది అలా అలా పోస్ట్ పోన్ అవుతూ ఈలోపు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీతో బిజీ అయ్యారు.
అటు ప్రభాస్ కూడా వరస కమిట్మెంట్స్ తో సలార్ 2 షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుంది. ఒకొనొక సమయంలో సలార్ 2 ఆగిపోయింది అందుకే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో మూవీ మొదలు పెట్టారనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా సలార్ 2నుంచి ఓ బిగ్ అప్ డేట్ బయటికొచ్చింది. అది ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చేస్తున్న బిగ్ పాన్ ఇండియా మూవీ విడుదల తర్వాత ప్రభాస్ తో కలిసి సలార్ 2 సెట్ లోకి వెళ్తారని తెలుస్తుంది.
ఎన్టీఆర్-నీల్ డ్రాగన్(వర్కింగ్ టైటిల్) వచ్చే ఏడాది జనవరి లో రిపబ్లిక్ డే స్పెషల్ గా విడుదలకు సన్నహాలు చేస్తున్నారు. ఇటు ప్రభాస్ రాజా సాబ్, ఫౌజీ సినిమాలు పూర్తి చేసి స్పిరిట్ సెట్లోకి వెళతారు. స్పిరిట్ పూర్తి కాగానే నీల్ తో కలిసి సలార్ 2 షూటింగ్ పూర్తి చేస్తారని టాక్. సో ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ 2పై ఎలాంటి బెంగ పెట్టుకోవక్కర్లేదన్నమాట.