భారతదేశంలో అత్యంత పాపులర్ టెలివిజన్ క్విజ్ షో కేబీసీ 17వ సీజన్ ప్రారంభం కానుంది. ఈసారి హోస్ట్ గా అమితాబ్ స్థానాన్ని సల్మాన్ ఖాన్ రీప్లేస్ చేస్తారని కొంత కాలంగా కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది నిజం కాదు.. ఈసారి కూడా అమితాబ్ తిరిగి వస్తున్నారని సోని ఎంటర్ టైన్ మెంట్ అధికారికంగా ప్రకటించింది. తాజాగా అమితాబ్ తో కేబీసీ సీజన్ 17 ప్రోమో విడుదలై అన్ని సందేహాల్ని క్లియర్ చేసింది.
అంతేకాదు.. 82 ఏళ్ల వయసులో ఒక్కో ఎపిసోడ్ కి 5 కోట్ల పారితోషికం అందుకుంటూ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ రికార్డు సృష్టించాడు. ఆ వయసులో అంత పెద్ద పారితోషికం అందుకుంటున్న మరొక టీవీ హోస్ట్ ప్రపంచంలో వేరొకరు లేనే లేరు. ఒక్కో ఎపిసోడ్ కి 5 కోట్ల పారితోషికం అందుకున్న అమితాబ్ కేబీసీ 16 వ సీజన్ లో 50 ఎపిసోడ్ల కోసం ఏకంగా 250 కోట్లు అందుకున్నాడు.
కేబీసీ 25 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఈ షోలో అమితాబ్ ఐకానిక్ `నమస్తే` గొప్ప ప్రేమను పొందింది. అలాగే ఆయన ట్రేడ్ మార్క్ హోస్టింగ్ ఎప్పటికీ మనసుల్ని గెలుచుకుంటూనే ఉంది. ఇక అమితాబ్ 80 ప్లస్ వయసులోను సినీరంగంలోను దూకుడుగా కొనసాగుతున్నారు. అతడు నటించిన `సెక్షన్ 84` విడుదలకు రావాల్సి ఉంది. బ్రహ్మాస్త్ర 2 , కల్కి 2898 ఏడీ సీక్వెల్ చిత్రాల్లోను అమితాబ్ నటిస్తారు.