కోలీవుడ్ లో స్టంట్ మాస్టర్ రాజు మృతి తమిళ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పా. రంజిత్-ఆర్య కలయికలో తెరకెక్కుతున్న సినిమా సెట్ లో స్టంట్ మాస్టర్ రాజు రిస్కీ కార్ స్టంట్ చేస్తూ షాకిచ్చే రీతిలో మృతి చెందడం అందరిని కలిచివేసింది. ప్రస్తుతం స్టంట్ మాస్టర్ రాజు ఫైట్ కొరియోగ్రాఫ్ చేస్తూ కార్ లో చనిపోయిన వీడియో వైరల్ గా మారింది.
ఈ ఘటనలో చెన్నై పోలీసులు దర్శకుడు పా.రంజిత్ తో పాటుగా సెట్ లోని మరో ముగ్గురిపైకేసు నమోదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. స్టంట్ మాస్టర్ రాజు అది రిస్కీ షాట్ అని చెప్పినా రాజు ని ఫోర్స్ చేసి పా. రంజిత్ చెయ్యమండంతోనే రాజు ఆ స్టంట్ చేస్తూ చనిపోయాడని పా రంజిత్ పై ఆరోపణలు రావడంతో పోలీసులు పా.రంజిత్ పై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది.
స్టంట్ మాస్టర్ రాజు మృతి పై ఆయనతో పని చేసిన హీరోలందరూ విచారం వ్యక్తం చేస్తూ రాజు కుటుంబానికి తమ సంతాపాన్ని తెలియజేసారు.