Advertisementt

వార్ 2 లో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ఒక్కటి చాలు

Tue 15th Jul 2025 02:58 PM
naga vamsi  వార్ 2 లో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ఒక్కటి చాలు
Naga Vamsi Reveals Jr NTR Intro Scene in War 2 వార్ 2 లో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ఒక్కటి చాలు
Advertisement
Ads by CJ

వార్ 2 రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను దక్కించుకున్న నాగవంశీ తాజాగా వార్ 2 పై చేసిన క్రేజీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హృతిక్ రోషన్-ఎన్టీఆర్ కలయికలో అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న వార్ 2 చిత్రం ఆగష్టు 14 న విడుదల కాబోతుంది. తమిళనాట లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన కూలి పాన్ ఇండియా మూవీతో వార్ 2 యుద్దానికి సై అంటుంది. దానితో ఇండియన్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ఎక్కువైపోతోంది. 

తాజాగా నిర్మాత నాగవంశీ వార్ 2పై క్రేజీ కామెంట్స్ చేసారు. ఎన్టీఆర్ వార్ 2 సీన్ కి గూస్ బంప్స్ కాదు సినిమాకే హైలెట్ గా నిలవబోతుంది, అది హృతిక్ రోషన్-ఎన్టీఆర్ మధ్యన వచ్చే ఫైట్ సీన్, ఆ ఒక్కసీన్ చూసాకే నేను వార్ 2 హక్కులు కొన్నాను, ఇద్దరు హేమాహేమీలు స్క్రీన్ పై తలపడుతుంటే ఆ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. 

వార్ 2 మొత్తంలో ఎన్టీఆర్-హృతిక్ ఇద్దరూ సినిమా మొత్తం కనిపిస్తారు, ఎన్టీఆర్ కొన్ని నిమిషాలు మాత్రమే స్క్రీన్ స్పేస్ అంటూ ప్రచారం జరుగుతుంది అదంతా రూమర్ మాత్రమే అంటూ నాగవంశీ వార్ 2 పై భీభత్సమైన అంచనాలు పెంచేశారు. 

Naga Vamsi Reveals Jr NTR Intro Scene in War 2:

Naga Vamsi on NTR Intro Scene in War 2

Tags:   NAGA VAMSI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ