ఒకప్పుడు బెల్లంకొండ సురేష్ తన కొడుకు సాయి శ్రీనివాస్ ను హీరోగా పరిచయం చేసేటప్పుడు అసలు ప్రేక్షకులు తన కొడుకుని హీరోగా యాక్సెప్ట్ చేస్తారో, లేదో అనే భయంతో అప్పట్లో క్రేజీ హీరోయిన్ అయిన సమంత ను భారీ (ఫారమ్ హౌస్) పారితోషికం ఇచ్చి మరీ హీరోయిన్ గా తీసుకొచ్చారు. సమంత క్రేజ్ తన కొడుకుని హీరోగా నిలబెడుతుంది అని సమంత కి ఆమె కెరీర్ లోనే కళ్ళు చెదిరే పారితోషికం ఇచ్చారు.
ఇప్పుడు అదే మాదిరి బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల కు భారీ పారితోషికం ఇచ్చి గాలి జనార్దన్ రెడ్డి తన కొడుకు కిరీటి రెడ్డి కోసం తీసుకురావడం హైలెట్ అయ్యింది. కిరీటి రెడ్డి తో శ్రీలీల రొమాన్స్ చేస్తే ఆటోమాటిక్ గా ఆ సినిమాపై అందరిలో అంచనాలు మొదలవుతాయి. ప్రస్తుతం జూనియర్ సినిమా పరిస్థితి అదే.
జులై 18 న విడుదల కాబోతున్న జూనియర్ చిత్రంలో శ్రీలీల అందం, గ్లామర్ ఖచ్చితంగా సినిమాకి హెల్ప్ అవుతాయానడంలో సందేహం లేదు. జూనియర్ చిత్రానికి శ్రీలీల రికార్డ్ స్థాయిలో పారితోషికం అందుకుంది అనే వార్త వైరల్ అయ్యింది. మరి శ్రీలీల లాంటి క్రేజీ గర్ల్ ని కొత్త గా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యే హీరో కోసం కావాలంటే అంత సమర్పించుకోవాల్సిందే.
అప్పట్లో సాయి శ్రీనివాస్ కోసం సమంత వస్తే.. ఇప్పుడు కిరీటి రెడ్డి కోసం శ్రీలీల వచ్చింది.. అది కూడా భారీ పారితోషికానికి అన్నమాట.