నాని కృష్ణగాడి వీర ప్రేమగాధ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమై అనిల్ రావిపూడి చిత్రాలతో హైలెట్ అయిన మెహ్రీన్ కౌర్ కు ఇప్పుడు అస్సలు అవకాశాలు లేవు. తెలుగు సినిమాల్లో కనిపించి చాలా కాలమే అవుతుంది. అటు అనిల్ రావిపూడి కూడా మెహ్రీన్ ని తన సినిమాల్లోకి తీసుకోవడం లేదు.
అవకాశాలు లేకపోయినా అమ్మడు విహార యాత్రలకు మాత్రం మానడం లేదు. దుబాయ్ దగ్గర నుంచి క్రొయేషియా దేశం వరకు విహార యాత్రలు చుట్టేస్తోంది. లేదంటే గోవా ఇలా వెకేషన్స్ ను ఎంజాయ్ చెయ్యడమే కాదు, తాను వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
గ్లామర్ డాల్ లా అందాలు చూపిస్తున్నా మెహ్రీన్ ని పిలిచి అవకాశం ఇచ్చే నాధుడు కనిపించడం లేదు. ప్రస్తుతం మెహ్రీన్ కౌర్ క్రొయేషియా దేశానికి విహార యాత్రకు వెళ్లింది. క్రొయేషియా రాజధాని జాగ్రెబ్ తర్వాత అతి పెద్ద రెండవ నగరం అయిన స్ప్లిట్ అనే చారిత్రాత్మక నగరంలో మెహ్రీన్ చిల్ అవుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
అలా మెహ్రీన్ కౌర్ ని చూసిన వారు సినిమా అవకాశాలు లేకపోతేనేమి విహార యాత్రలకు కొదవు లేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.