కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం అలముకుంది. పా. రంజిత్ సినిమా షూటింగ్ సెట్ లో స్టంట్ మాస్టర్ రాజు ప్రమాదవశాత్తు మరణించడం తో సెట్ లోనే కాదు తమిళ సినిమా పరిశ్రమలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. పా. రంజిత్ దర్శకత్వంలో ఆర్య హీరోగా తెరకెక్కుతున్న సినిమా సెట్ లో స్టంట్స్ మాస్టర్ గా పని చేస్తున్న రాజు కార్ స్టంట్ చేస్తుండగా ప్రాణాలు కోల్పోయారు.
ఊహించని ఘటనకు చిత్ర బృందం షావగా.. సినీ ప్రముఖులు రాజు మృతిపై సంతాపం తెలియజేస్తున్నారు. స్టంట్ మాస్టర్ రాజు మృతి పట్ల హీరో విశాల్ ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ వైరలయ్యింది. రాజు మరణ వార్త విన్న వెంటనే షాక్‌కు గురయ్యాను. స్టంట్ మాస్టర్ రాజు ఇక లేడన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నాను.
ఎలాంటి సిట్యువేషన్ లో అయినా ధైర్యంగా, రిస్క్ తీసుకుని స్టంట్స్ చేసే వ్యక్తి రాజు. నా పలు సినిమాల్లో స్టంట్ మాస్టర్‌గా రాజు పని చేశాడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో రాజు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ విశ్వాల్ ట్వీట్ చేశారు