ప్రముఖ విలక్షణ నటులు కోట శ్రీనివాసరావు ఈరోజు ఆదివారం ఉదయం కన్ను మూసిన విషయం తెలిసిందే. వయో భారంతో అనారోగ్యంతో బాధపడుతున్న కోట ఈరోజు ఉదయం మృతి చెందారు. కోట మరణంతో టాలీవుడ్ చిన్నబోయింది. తెలుగు సినిమా పరిశ్రమ కన్నీళ్లు పెట్టింది. సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజెసారు.
ఏపీ సీఎం చంద్రబాబు, మెగాస్టార్ చిరు, వెంకటేష్, పవన్ కళ్యాణ్, బ్రహ్మానందం వంటి ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఈరోజు మధ్యాన్నం 4 గంటలకు కోట శ్రీనివాసరావు అంతక్రియలను కుటుంబ సభ్యులు పూర్తి చేసారు. ఫిల్మ్ నగర్‌లోని కోట శ్రీనివాసరావు నివాసం నుంచి మహాప్రస్థానం వరకు ఆయన అంతిమ యాత్ర కొనసాగగా.. . వందలాది మంది సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు కడసారి నివాళులర్పించారు.
హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కుటుంబసభ్యుల సమక్షంలో పెద్ద మనవడు శ్రీనివాస్ ఆయన చితికి నిప్పంటించి అంతిమ సంస్కారాలు పూర్తి చేసారు.