Advertisementt

మాళవిక ఫస్ట్ తెలుగు సినిమా రాజా సాబ్ కాదు

Sun 13th Jul 2025 05:13 PM
malavika mohanan  మాళవిక ఫస్ట్ తెలుగు సినిమా రాజా సాబ్ కాదు
Malavika Mohanan first Telugu film is not Raja Saab మాళవిక ఫస్ట్ తెలుగు సినిమా రాజా సాబ్ కాదు
Advertisement
Ads by CJ

మాళవిక మోహనన్ మలయాళం నుంచి వచ్చి తమిళనాట హీరోయిన్ గా బాగా ఫేమస్ అయ్యింది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజా సాబ్ తో మాళవిక మోహనన్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతుంది. సోషల్ మీడియాలో ఎంతగా ఆమె గ్లామర్ షో చేస్తుందో అంతకు మించి రాజా సాబ్ లో మాళవిక మోహనన్ గ్లామర్ షో ఉండబోతుందనేది టీజర్ లో క్లారిటీ ఇచ్చేసారు దర్శకుడు మారుతి. 

అయితే మాళవిక మోహనన్ ఫస్ట్ తెలుగు సినిమా రాజా సాబ్ కాదట. ఆమె ప్రభాస్ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టడం లేదు, అంతకుముందే యంగ్ హీరో విజయ్ దేవరకొండ సినిమాలో ఆమెకు అవకాశం వచ్చిందట. ఆ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక కావడమే కాదు, విజయ్ దేవరకొండ తో కలిసి కొంతమేర షూటింగ్ చేశాకే ఆ సినిమా ఆగిపోవడంతో ఆమె మళ్లీ తమిళనాట బిజీ అయ్యింది. విజయ్ దేవరకొండ-మాళవిక మోహనన్ కలిసి చేసిన సినిమా హీరో. 

సో ఆ సినిమాతో టాలీవుడ్ కి రావాల్సిన మాళవిక మోహనన్ ఇప్పుడు రాజా సాబ్ తో టాలీవుడ్ కి అడుగుపెడుతుందన్నమాట. 

Malavika Mohanan first Telugu film is not Raja Saab:

Malavika Mohanan

Tags:   MALAVIKA MOHANAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ