టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ లైగర్ చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్ లో అడుగుపెట్టాలనుకున్నాడు. కానీ లైగర్ దెబ్బకు విజయ్ దేవరకొండ మరోసారి ఆ సాహసం చెయ్యలేదు. కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ హిందీ మర్కెట్ లో సత్తా చాటుతాడు అనుకుంటే ప్రస్తుతం అది కూడా జరగడం లేదు.
తాజాగా విజయ్ దేవరకొండ కు బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తుంది. కానీ విజయ్ దేవరకొండ ఆ ఆఫర్ ని తిరస్కరించారని అంటున్నారు. అది కూడా ప్రెస్టీజియస్ సీక్వెల్ డాన్-3 అని తెలుస్తుంది. డాన్-3 సినిమాలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తున్నాడు.
ఫర్హాన్ అక్తర్ డైరెక్ట్ చేస్తున్న డాన్-3 విలన్ పాత్ర కోసం విజయ్ దేవరకొండను తీసుకోవాలని మేకర్స్ భావించారని.. కానీ ఈ ఆఫర్‌ను ఆయన సున్నితంగా తిరస్కరించాడు అని సమాచారం. మరి విజయ్ దేవరకొండ డైరెక్ట్ హిందీ మూవీ ఆఫర్ ని ఓకె చెయ్యాల్సింది అనేది ఆయన అభిమానుల కోరిక.