ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో కొత్త సినిమాని స్టార్ట్ చేసారు. అనౌన్సమెంట్ వీడియో తోనే AA 22 పై అందరిలో విపరీతమైన అంచనాలు పెంచిన అల్లు అర్జున్ అండ్ టీం.. ఆ తర్వాత ముంబై వేదికగా తమ పనులకు శ్రీకారం చుట్టారు. అల్లు అర్జున్ అండ్ అట్లీ హైదరాబాద్-ముంబై అంటూ అప్ అండ్ డౌన్ చేస్తున్నారు.
అయితే ఈ చిత్రంలో అల్లు అర్జున్ నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారని.. తాత, తండ్రి, ఇద్దరు కుమారులుగా అర్జున్ స్క్రీన్ పై సందడి చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఒకేసారి నాలుగు పాత్రలు అంటే నలుగురు అల్లు అర్జున్ లను ఒకేసారి స్క్రీన్ పై చూపిస్తే బాక్సాఫీసు బద్దలవ్వాల్సిందే అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంటర్నేషనల్ లెవల్లో అట్లీ అల్లు అర్జున్ ని నాలుగు డిఫ్రెంట్ పాత్రల్లో ప్రెజెంట్ చెయ్యనుండడం మాత్రం నిజంగా అందరిని ఎగ్జైట్ చేసే విషయమే.
భారీ బడ్జెట్ తో కనివిని ఎరుగని రీతిలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో ఇప్పటికే దీపికా పదుకొనె ఫైనల్ కాగా.. జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక పేర్లు వినిపిస్తున్నాయి.