ఇండస్ట్రీలో అంత వరకూ ఆ డైరెక్టర్ కు ఒక్క వైఫల్యం లేదు. చేసిన సినిమా ప్రతీది హిట్. నిర్మాతలకు భారీ లాభాలు చూసారు. ఆయనతో సినిమా అంటే సెట్ కు కూడా వెళ్లాల్సిన పనిలేదు. ప్రాజెక్ట్ ఓకే చేయించుకుంటే చాలు. సినిమా పూర్తి చేసి ఆయనే రిలీజ్ చేస్తాడు. ఫైనల్ గా వచ్చిన లాభాలు తీసు కోవడమే అన్నంత నమ్మకం ఆ నయా డైరెక్టర్ నిర్మాతలకు కల్పించాడు. ప్రేక్షకుల్లోనూ అతడు క్లాస్ కం మాస్ డైరెక్టర్ ముద్ర పడిపోయింది. అలా మార్కెట్ లో ఆయనో బ్రాండ్ గా మారిపోయారు.
కానీ ఆ ముద్రను.. ఆ బ్రాండ్ ఇమేజ్ ను ఓ ఇద్దరు తండ్రీకొడుకులు దెబ్బ తీసారు. ఆ డైరెక్టర్ తో తనయుడితో సినిమా అంటూ అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఆ చిత్రాన్ని ప్రారంభించారు. క్లాప్ కొట్టారు..కెమెరా స్విచ్ఛాన్ చేసారు. ముహూర్తపు సన్నివేశాన్ని డైరెక్ట్ చేసారు. కట్ చేస్తే ఆసినిమా మరుసటి రోజే ఆగిపోయింది. అలా ఆగిపోవడానికి గల కారణాలు ఏంటి? అన్నది ఇంత వరకూ బయటకు రాలేదు. అంతా గోప్యంగానే ఉంది. హీరో మాత్రం ఆ సినిమా గురించి ఎక్కడా మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు.
కథ నచ్చలేదా? డైరెక్టర్ నచ్చలేదా? అతడిపై నమ్మకాన్ని కోల్పోయాడా? ఇలా ఎన్నో సందేహాలు ప్రేక్షకుల్లో ఇప్పటికీ అలాగే మిగిలి పోయాయి. అలా ఆ స్టార్ డైరెక్టర్ ఆ కాంపౌండ్ లో తొలిసారి అవమానం జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తండ్రి అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా విషయంలో మాత్రం ఎలాంటి ప్రతికూల పరిస్థితులు నెలకొనలేదు. సవ్యంగా ప్రారంభమైంది. అంతే సవ్యంగానే రిలీజ్ అయింది. కానీ ఫలితం మాత్రం దారుణంగా వచ్చింది. ఇలా ఎందుకు జరిగిందంటే? కథలో హీరోలు కాళ్లు.. వేళ్లు పెట్టడంతోనే ఇలాంటి రిజల్ట్ వచ్చిందని కొన్నాళ్లకు జనాలందరికీ క్లారిటీ వచ్చింది.
అలా ఆ స్టార్ డైరెక్టర్ ఇమేజ్ పై కొంత ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో ఆ నయా డైరెక్టర్ మళ్లీ జీవితంలో ఆ కాంపౌండ్ హీరోలతో సినిమాలు తీయకూడదని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారని తాజాగా ఓ న్యూస్ వెలుగులోకి వచ్చింది. పిలిచి వాళ్లు అవకాశం ఇచ్చినా? అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా? ఈయన మాత్రం వెళ్లడానికి సిద్దంగా లేడని తమ కారణంగా తనకు జరిగిన డ్యామేజ్ తో ఇంకా రగిలిపోతున్నాడని సమాచారం. మరి బలంగా తగిలిన ఈ గాయం ఎప్పటికీ మానెనో.