Advertisementt

యానిమ‌ల్‌తో ల‌వ్.. తిట్లు తిన్న ర‌ష్మిక‌

Sat 12th Jul 2025 09:07 AM
rashmika  యానిమ‌ల్‌తో ల‌వ్.. తిట్లు తిన్న ర‌ష్మిక‌
Rashmika trolled for Animal comment యానిమ‌ల్‌తో ల‌వ్.. తిట్లు తిన్న ర‌ష్మిక‌
Advertisement
Ads by CJ

సందీప్ వంగా తెర‌కెక్కించిన `యానిమల్` పాన్ ఇండియాలో సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ర‌గ్గ్ డ్ గా ఉండే గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌లో ర‌ణబీర్ క‌పూర్ న‌టించాడు. ర‌ణ్ విజ‌య్ అత‌డి పాత్ర పేరు. అతడు చాలా యారొగెంట్. భార్య‌తో స‌ర‌సాల్లోను యారొగెన్సీ చూపిస్తాడు. అయితే నిజ జీవితంలో అలాంటి వ్య‌క్తితో డేట్ చేస్తారా? అని ర‌ష్మిక‌ను ప్ర‌శ్నించ‌గా.. తాను అత‌డితో డేటింగ్ చేయ‌డానికి ఓకే అని అన్నారు.

ఒక‌సారి ప్రేమ‌లో ప‌డ్డాక‌, డేట్ లో ఉన్న త‌ర్వాత అత‌డు-ఆమె ఇద్ద‌రిలో మార్పులు రావ‌డానికి ఆస్కారం ఉంద‌ని ర‌ష్మిక అభిప్రాయ‌ప‌డ్డాడు. అత‌డు ఎలాంటి వాడైనా ఆమె సాహ‌చ‌ర్యంలో మార‌తాడు అనే న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేసింది. అయితే తెర‌పైనే మార‌ని వాడు నిజ జీవితంలో మార‌తాడా? అంటూ కొంద‌రు సెటైర్లు వేసారు.

అయితే రష్మిక త‌న మాట‌ల‌ను స‌మ‌ర్థిస్తూ, చిన్న‌ప్ప‌టి నుంచి క‌లిసి మెలిసి ఉన్న స్నేహితులు.. పెద్ద‌య్యాక‌.. ప్రేమ‌లో ఉన్న త‌ర్వాత లేదా భాగ‌స్వాములుగా మారాక‌.. మార్పున‌కు ఆస్కారం ఉంటుంద‌ని, అతడు లేదా ఆమె ఎలా ఉంటారు? అనేది భాగ‌స్వామికి తెలుస్తుంది గ‌నుక స‌మ‌స్య‌లు ఉండ‌వ‌ని కూడా ర‌ష్మిక అన్నారు. అయితే రష్మిక మంద‌న్న వ్యాఖ్య‌లు నెటిజ‌నుల‌కు రుచించ‌లేదు. త‌న‌పై తీవ్రంగా విరుచుకుప‌డుతున్నారు.. ఘోరంగా ట్రోలింగ్ చేస్తున్నారు. 

Rashmika trolled for Animal comment:

Rashmika Facing Heat In Social Media

Tags:   RASHMIKA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ