ఉత్తర భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన కామెడీ సినిమాగా `హౌస్‌ఫుల్ 5` రికార్డులకెక్కిందని మీడియాలో కథనాలొస్తున్నాయి. ఈ సినిమాలో కామెడీ కంటే, అడల్ట్ కామెడీ, సంభాషణలు విసిగించాయని విమర్శలొచ్చాయి. అయితే బాక్సాఫీస్ వసూళ్లపై ఆ ప్రభావం పడలేదు. ఇక ఈ చిత్రంలో అందాల భామలు ఒకరితో ఒకరు పోటీపడుతూ అందాల్ని ఆరబోసారు. తాజాగా సోనమ్ బజ్వా తన పాత్రకు వచ్చిన స్పందనపై ఓపెన్ అయింది. పది మంది టాప్ స్టార్ల మధ్య నటించినా తనకు ఈ గుర్తింపు రావడాన్ని వినయంగా చూస్తానని సోనమ్ అన్నారు.
వినోదం పండించే సినిమాలో నా నటనకు గుర్తింపు దక్కడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఈ చిత్రం ఉత్తర భారత బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ కామెడీ చిత్రంగా నిలవడం నిజంగా గొప్పగా అనిపిస్తోంది. ఇంత గొప్ప స్పందన- ప్రేమ అందించిన ప్రేక్షకులకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని.. నా భవిష్యత్ హిందీ చిత్రాలన్నింటిలోనూ ఇలాగే వారి హృదయాలను గెలుచుకోవాలని ఆశిస్తున్నాను`` అని రాసారు. బజ్వా `హౌస్‌ఫుల్ 5`చిత్రంతోనే బాలీవుడ్ లో అడుగుపెట్టారు. తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహించిన ఈ కామెడీ చిత్రం చాలా విమర్శల్ని ఎదుర్కొన్నా కానీ, బాక్సాఫీస్ వసూళ్లలో ఫెయిల్ కాలేదు. ఇది గోల్‌మాల్, ధమాల్ లాంటి ఫ్రాంఛైజీ చిత్రాల రికార్డులను బ్రేక్ చేసిందని కూడా కథనాలొచ్చాయి. హౌస్‌ఫుల్ 5 లో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్, డినో మోరియా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనమ్ బజ్వా, నాగిస్ ఫక్రీ, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, నానా పటేకర్, చిత్రాంగద సింగ్, ఫర్దీన్ ఖాన్, చుంకీ పాండే, జానీ లివర్, శ్రేయాస్ తల్పాడే, రంజీత్, సౌందర్య శర్మ లాంటి టాప్ స్టార్స్ నటించారు. హౌస్ ఫుల్ 5లో తన స్పైసీ నటనతో ఆకట్టుకున్న సోనమ్ బజ్వా కోసం పలువురు తెలుగు దర్శకులు అవకాశాలిచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి