ప్రభాస్ బాహుబలికి ముందు మిర్చి సినిమా సమయంలో చాలా హ్యాండ్ సమ్ గా స్మార్ట్ గా కనిపించేవారు, ప్రభాస్ కటౌట్ కి పడిపోని అమ్మాయి ఉండేది కాదు. బాహుబలి చిత్రంలోనూ ప్రభాస్ ఒక రాజు అంటే ఇలానే ఉండాలి అనే ఆహార్యంతో అద్భుతంగా ఆకట్టుకున్నారు. పర భాషా ఆడియన్స్ ను కూడా ప్రభాస్ విపరీతంగా ఇంప్రెస్స్ చేసారు.
అయితే బాహుబాలి తర్వాత ప్రభాస్ లుక్స్ విషయంలో అభిమానులు డిజప్పాయింట్ అవ్వని రోజు లేదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ ఇలా ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో లుక్స్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు ప్రభాస్. ఎంతగా జిమ్ చేసినా స్వతహాగా ఫ్యూడి అయిన ప్రభాస్ వెయిట్ విషయంలో ఎలాంటి ప్రభావం చూపించలేకపోయారు.
అయితే రీసెంట్ గా ప్రభాస్ రాజా సాబ్ సెట్ లో SKN బర్త్ డే లోను స్మార్ట్ లుక్ లో కనిపించగానే ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అయ్యారు.అలాగే బాహుబలి రీ యూనియన్ సెలెబ్రేషన్స్ లోను ప్రభాస్ స్మార్ట్ గా హ్యాండ్ సమ్ గా కనిపించారు. బాహుబలి వచ్చిన పదేళ్లకు ప్రభాస్ ఇలా స్మార్ట్ లుక్ లో కనిపించారంటూ ఆయన అభిమానులే మాట్లాడుకుంటున్నారు.
ప్రభాస్ బాహుబలి బరువుని దించుకోవడానికి పదేళ్లు పట్టింది అంటూ ప్రభాస్ కొత్త లుక్ చూసిన నెటిజెన్స్ కామెన్లు పెడుతున్నారు.