ఎపుడో జనవరిలో విడుదల చేసిన విశ్వంభర గ్లింప్స్ లోని విఎఫెక్స్ వర్క్ పై వచ్చిన విమర్శలతో విశ్వంభర టీం కి మైండ్ బ్లాంక్ అయ్యింది. గేమ్ చెంజర్ కోసం విశ్వంభర పోస్ట్ పోన్ అంటూ బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత విశ్వంభర చిత్రాన్ని ఎప్పుడు విడుదల చెయ్యాలో తెలియక కేవలం విఎఫెక్స్ పనులకే దర్శకుడు వసిష్ఠ సమయాన్ని వెచ్చించారు.
విశ్వంభర రిలీజ్ తేదీ ఇవ్వకపోయేసరికి మెగా ఫ్యాన్స్ కు ఒళ్ళు మండిపోతుంది. వసిష్ఠ ఏదో హడావిడిగా విశ్వంభర విడుదల తేదీ ప్రకటించేసి, హరీబరిగా పనులు చక్కబెట్టకుండా కూల్ గా సీజీ వర్క్ పై ఫోకస్ పెట్టారు. తాజాగా మెగాస్టార్ చిరు విశ్వంభర 45 నిమిషాల ఫుటేజ్ ని చూసి పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తుంది.
అంతేకాకుండా త్వరలోనే బ్యాలన్స్ ఉన్న ఐటెం సాంగ్ తో పాటు చిన్న ప్యాచ్ వర్క్ పూర్తి చేసేసి రిలీజ్ డేట్ లాక్ చెయ్యాలని చూస్తున్నారట వసిష్ఠ. అది కూడా సెప్టెంబర్ 18 న అయితే ఎలా అంటుంది అనే ఆలోచనలో విశ్వంభర మేకర్స్ తో పాటుగా చిరు కూడా ఆలోచిస్తున్నారని టాక్ వినిపిస్తుంది.