కోలీవుడ్ హీరో ధనుష్-కింగ్ నాగార్జున కలయికలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన కుబేర చిత్రం జూన్ 20 న పాన్ ఇండియా మూవీగా థియేటర్స్ లో విడుదలైంది. కుబేర చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టడంతో 100 కోట్ల క్లబ్బు లోకి వారం తిరిగేలోపే ఎంటర్ అయ్యింది.
అయితే కలిసొస్తుంది అనుకున్న తమిళ మార్కెట్ కుబేర కు దెబ్బేసింది. తమిళనాట కుబేర వర్కౌట్ అవ్వలేదు, మరోపక్క హిందీలోనూ కుబేర పెరఫార్మెన్స్ అంతంతమాత్రంగానే ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ అయిన కుబేర చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు.
తాజాగా కుబేర డేట్ ని అమెజాన్ ప్రైమ్ రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అమెజాన్ ప్రైమ్ కుబేర డిజిటల్ హక్కులని 47 కొట్ల ఫ్యాన్సీ డీల్ తో అన్ని లాంగ్వేజెస్ కి దక్కించుకోగా.. జులై 18 నుంచి కుబేర విడుదలైన పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఈలెక్కన కుబేర థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాలకే స్ట్రీమింగ్ లోకి రాబోతుందన్నమాట.