Advertisementt

హీరోయిన్ కోసం కూడా వెయిట్ చేస్తారా

Wed 09th Jul 2025 07:49 PM
don 3 delayed  హీరోయిన్ కోసం కూడా వెయిట్ చేస్తారా
Don 3 shooting stalled due to kiara హీరోయిన్ కోసం కూడా వెయిట్ చేస్తారా
Advertisement
Ads by CJ

సాధార‌ణంగా హీరోల డేట్ల కోసం స్టార్ డైరెక్ట‌ర్లు అంతా ఎదురు చూస్తుంటారు. స్టోరీ వినిపించిన త‌ర్వాత న‌చ్చితే?  హీరో  డేట్లు ఇస్తాడు. అప్ప‌టి వ‌ర‌కూ డైరెక్ట‌ర్ వెయిట్ చేస్తుంటాడు. బాగా ఆలస్య‌మ వుతుంద నుకుంటే ఈలోపు మ‌రో చిత్రాన్ని మ‌రో హీరోతో చేసి వ‌స్తాడు. ఈ క్ర‌మంలో కొంత ఆదాయం స‌మకూరు తుంది. కానీ క్రియేటివ్ ఫీల్డ్ లో అంద‌రూ ఇలా ఉండాల‌నే లేదు. కొంత మంది సినిమా-సినిమాకు కావాల‌నే గ్యాప్ తీసుకుంటారు. కానీ ఏ డైరెక్ట‌ర్ హీరోయిన్ కోసం మాత్రం ఎదురు చూసే ప‌రిస్థితి ఉండ‌దు.

 

ఎందుకంటే హీరోయిన్ విష‌యంలో ఆమె కాక‌పోతే మ‌రొక‌రు అనే ఆప్ష‌న్ కి వెళ్లిపోతారు. వాళ్లు కుద‌ర‌క‌పోతే కొత్త భామ‌ను తీసుకుని సెట్స్ కి వెళ్తారు. ఇక్క‌డ హీరోయిన్ ని డైరెక్ట‌ర్లు పెద్ద‌గా ప్రామాణికంగా తీసుకోరు. కానీ బాలీవుడ్ డైరెక్ట‌ర్  ప‌ర్హాన్ అక్త‌ర్ మాత్రం హీరోయిన్ కోస‌మే సినిమాను ఆపేసాడ‌ని ఎంత మందికి తెలుసు? అవును ఈ సంగ‌తి ఇప్పుడే వెలుగులోకి వ‌స్తోంది. బాలీవుడ్ హిట్ ప్రాంచైజీ డాన్ నుంచి `డాన్ 3` రెడీ అవు తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో హీరోగా ర‌ణ‌వీర్ సింగ్ ఫైనల్ అయ్యాడు.

 

హీరోయిన్ గా కియారా అద్వాణీ ఎంపికైంది. అయితే ఆమె గ‌ర్బం దాల్చ‌డంతో ఆమె స్థానంలో కృతిస‌న‌న్ ఎంపిక చేసిన‌ట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. కానీ తాజా అప్ డేట్ ఏంటంటే?  `డాన్ 3` లో హీరోయిన్ గా కియా రానే న‌టిస్తోందని చిత్ర వ‌ర్గాల నుంచి తెలిసింది. కియారా ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకోలేద‌ని..ఆమె కోస‌మే తా మంతా వెయిట్ చేస్తున్న‌ట్లు బాలీవుడ్  మీడియాలో ఓ వార్త తెర‌పైకి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే క్రియారా ప్ర‌స‌వం అనంత‌రం షూటింగ్ ప్లాన్ చేస్తున్న‌ట్లు వినిపిస్తోంది.

 

జ‌న‌వ‌రి నుంచి సెట్స్ కు వెళ్తున్న‌ట్లు ఇటీవ‌లే అధికారికంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. న‌వంబ‌ర్ లో కియారా పాపాయికి జ‌న్మ‌నివ్వ‌బోతుంద‌ని స‌మాచారం. అటుపై మూడు నాలుగు నెల‌ల గ్యాప్ అనంత‌రం కియారా షూటింగ్ లో పాల్గొంటుంద‌ని తెలుస్తోంది.   

Don 3 shooting stalled due to kiara:

Shooting for Don 3 delayed due to Kiara Advani pregnancy

Tags:   DON 3 DELAYED
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ