Advertisementt

బాలయ్య తో వెంకీ మల్టీస్టారర్

Mon 07th Jul 2025 05:34 PM
venkatesh  బాలయ్య తో వెంకీ మల్టీస్టారర్
Venkatesh Says Yes to Another Big Film బాలయ్య తో వెంకీ మల్టీస్టారర్
Advertisement
Ads by CJ

విక్టరీ వేంకటేష్ ఇప్పుడు సీనియర్ హీరోగా సక్సెస్ లు సాధించడమే కాదు తన సమకాలికులు చిత్రాల్లో నటించడం హాట్ టాపిక్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి తో #Mega 157 లో గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఆయన ఆ విషయమే తాజాగా రివీల్ చేసారు. చిరంజీవి-అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కుతున్న చిత్రంలో ఓ ఫన్నీ రోల్ ప్లే చేస్తున్నట్టుగా చెప్పారు. 

అంతేకాదు తన ఫ్రెండ్ అయిన మరో స్టార్ హీరో సినిమాలో తను నటిస్తున్నట్టుగా చెప్పారు. అది నందమూరి బాలకృష్ణే అని తెలుస్తుంది. అయితే బాలయ్య-వెంకీ కలయికలో తెరకెక్కబోయే ఆ ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్ ని ఎవరు డైరెక్ట్ చేస్తారు, ఎవరు ఈ క్రేజీ చిత్రాన్ని నిర్మిస్తారనే విషయాన్ని మాత్రం వెంకీ బయటపెట్టలేదు. 

మరి నటసింహ బాలయ్య-విక్టరీనే ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్.. కలసి సినిమాలో కనిపిస్తే బాక్స్ లు బద్దలవ్వాల్సిందే అంటూ ఇరు హీరోల అభిమానులు మాట్లాడుకోవడం గమనార్హం. 

Venkatesh Says Yes to Another Big Film:

Venkatesh confirms upcoming film with Balakrishna

Tags:   VENKATESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ