కొన్నాళ్లుగా పబ్లిక్ లో కనిపించని ప్రభాస్ ఏం చేస్తున్నారు. ఆయన నటిస్తన్న సినిమాల స్టేటస్ ఏమిటి, రాజా సాబ్ షూటింగ్ ఎన్ని రోజులకు పూర్తవుతుంది. ఫౌజీ షూటింగ్ ఎక్కడివరకు వచ్చింది, సందీప్ రెడ్డి వంగ తో ప్రభాస్ చెయ్యాల్సిన స్పిరిట్ ఎపుడు మొదలవుతుంది, కల్కి 2 పరిస్థితి ఏమిటి ఇలా ఎన్నో రకాల ప్రశ్నలతో ప్రభాస్ ఫ్యాన్స్ సతమతమవుతున్నారు.
మారుతి తో ప్రభాస్ చేస్తున్న రాజా సాబ్ టీజర్ రీసెంట్ గా విడుదలై పాన్ ఇండియా ఆడియన్స్ ను ఇంప్రెస్స్ చేసింది. అయితే షూటింగ్ ఎప్పటివరకు పూర్తవుతుంది అనే అప్ డేట్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తాజాగా రాజా సాబ్ షూటింగ్ అప్ డేట్ వైరల్ అయ్యింది. రాజా సాబ్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.
ప్రభాస్ ఈనెలాఖరు వరకు రెండు మూడు రోజులు అటు ఇటుగా రాజా సాబ్ సెట్ లోనే ఉంటారట. దానితో రాజా సాబ్ టాకి పార్ట్ పూర్తవుతుంది అని తెలుస్తుంది. సో టాకీ పూర్తవుతే దర్శకుడు మారుతి ఇకపై విఎఫెక్స్ పనులపై దృష్టి పెడతారని సమాచారం. రాజా సాబ్ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దీ కుమార్ లు ప్రభాస్ సరసన నటిస్తున్నారు.