గత రెండు వారాలుగా కుబేర, కన్నప్ప చిత్రాలు ఆడియన్స్ లో థియేటర్స్ కి వెళ్లాలనే ఊపును తీసుకొచ్చాయి. గత మూడు నాలుగు నెలలుగా స్తబ్దుగా పడి ఉన్న బాక్సాఫీసుని కుబేర కళకళలాడేలా చేసింది. ఆతర్వాత కన్నప్ప కూస్తో కూస్తో ఇంట్రెస్ట్ కలిగించింది. అదే ఊపును నితిన్ తమ్ముడు కంటిన్యూ చేస్తుంది అని చాలామంది భావించారు.
జులై 4 న విడుదలైన నితిన్-వేణు శ్రీరామ్ తమ్ముడు ఆడియన్స్ అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. తమ్ముడు చిత్రానికి ఆడియన్స్ మాత్రమే కాదు క్రిటిక్స్ కూడా నెగెటివ్ రెస్పాన్స్ చూపించడంతో తమ్ముడు కి రెండోరోజు థియేటర్స్ లో ప్రేక్షకులు కనిపించే ఛాన్స్ లేకుండా పోయింది. ఇక తమిళంలో తెరకెక్కి తెలుగులో సిద్దార్థ్ 3BHK చిత్రం కూడా జులై 4 నే విడుదలైంది.
3BHK చిత్రాన్ని సిద్దార్థ్ అండ్ చిత్ర బృందం తెగ ప్రమోట్ చేసింది. ఆ చిత్రము ప్రేక్షకులను ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది. ఇక నవీన్ చంద్ర షో టైం కూడా ఈ వారమే విడుదలైంది. ఈ చిత్రము నిరాశపరిచింది. టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన ఉప్పుకప్పురంబు చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీ నుంచి నేరుగా ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది.
ఉప్పుకప్పురంబు కూడా ఆడియన్స్ ను నిరాశపరిచింది. ఇక బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ సోలో బాయ్ ఈ శుక్రవారమే విడుదలైంది. ఈచిత్రం కూడా ఎలాంటి హడావిడి లేకుండా థియేటర్స్ నుంచి వెళ్ళిపోయెలా ఉంది పరిస్థితి. ఈ వారం విడుదలైన నాలుగైదు సినిమాలు నిరాశపరచడంతో బాక్సాఫీసు బోసిపోయింది.