భోపాల్ (మధ్య ప్రదేశ్)లోని తన కుటుంబ పూర్వీకుల ఆస్తులను `శత్రువుల ఆస్తి`గా ముద్ర వేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ `ఆదిపురుష్` నటుడు సైఫ్ అలీ ఖాన్ కోర్టుల పరిధిలో పోరాటం సాగిస్తున్న సంగతి తెలిసిందే. 25 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవల తిరస్కరించడంతో ఆయన చట్టపరమైన ఇబ్బందుల్లో పడ్డారు.
భారత్- పాకిస్తాన్ విభజన తర్వాత పాకిస్తాన్‌కు వెళ్లి భారత పౌరసత్వాన్ని వదులుకున్న నవాబ్ హమీద్ ఉల్లా ఖాన్ వారసులు పాతికేళ్ల క్రితమే అప్పీల్ దాఖలు చేయగా, దీనిపై కోర్టులో విచారణ సాగుతోంది. నవాబ్ తన పెద్ద భార్య కుమార్తె సాజిదా సుల్తాన్‌కు అనుకూలంగా మునుపటి ఆస్తి పంపిణీని ఇది సవాలు చేసింది. ఆ తర్వాత కోర్టు విచారిస్తోంది. 15,000 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన కేసు తిరిగి వార్తల్లోకి వచ్చింది. ఇందులో ఫ్లాగ్ స్టాఫ్ హౌస్, నూర్-ఉస్-సబా ప్యాలెస్ , అహ్మదాబాద్ ప్యాలెస్ వంటి అనేక చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. నవాబ్ వ్యక్తిగత ఆస్తులు స్వయంచాలకంగా రాజ వారసత్వంలో భాగమని, తదుపరి ఎవరు పరిపాలిస్తారో ఆ పాలకుడికి వెళ్లాలని కోర్టు నమ్మకాన్ని ప్రశ్నిస్తున్నందున హైకోర్టు నిర్ణయం ముఖ్యమైనది.
అయితే చాలా కాలం క్రితం శత్రు ఆస్తి చట్టం ఒకటి అమల్లోకి వచ్చింది. 1968లో ఇది ప్రారంభమైంది. సంఘర్షణ లేదా యుద్ధ సమయాల్లో విదేశాలకు వలస వెళ్ళే వ్యక్తులు వదిలిపెట్టిన ఆస్తులను పరిష్కరించే చట్టమిది. ఆ సమయంలో దేశం వదిలి శత్రువును ఆశ్రయించిన వారిని శత్రువులుగా పరిగణిస్తారు. ఆ ఆస్తులను `శత్రువు ఆస్తి`గా వర్గీకరిస్తారు. సైఫ్ అలీ ఖాన్ కేసులో నవాబ్ పెద్ద కుమార్తె, సైఫ్ అలీ ఖాన్ ముత్తాత అబిదా సుల్తాన్ విభజన తర్వాత పాకిస్తాన్‌కు వలస వెళ్ళిన తర్వాత కొన్ని ఆస్తులను `శత్రువు ఆస్తి`గా వర్గీకరించారు.
పాకిస్తాన్ లేదా చైనాకు వలస వెళ్లి భారత పౌరసత్వాన్ని త్యజించిన వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి చట్టం అనుమతిస్తుంది.13 డిసెంబర్ 2024న హైకోర్టు ఆ స్టేను రద్దు చేయడమే కాకుండా సైఫ్ ఖాన్ అభ్యర్థనను కూడా తిరస్కరించింది. ప్రస్తుతం ఇది ఇంకా కోర్టు విచారణలో ఉంది.