బాలీవుడ్ లో నితీష్ తివారి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం రామాయణ. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న రామాయణ చిత్ర గ్లింప్స్ రీసెంట్ గానే విడుదల చెయ్యగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రాముడిగా రణబీర్ కపూర్, రావణ్ గా యష్, సీత గా సాయి పల్లవి కనిపించబోతున్న రామాయణ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది.
అయితే రామాయణ బడ్జెట్ పై సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణ కు హీరో యష్ సహా ప్రొడ్యూసర్ గా ఉన్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న రామాయణ కోసం రికార్డ్ బడ్జెట్ పెడుతున్నారట నిర్మాతలు. దాదాపుగా రామాయణ కు 1600 కోట్ల కళ్ళు చెదిరే బడ్జెట్ ను రామాయణ కోసం స్పెండ్ చేస్తున్నారని అంటున్నారు.
మరి ఇండియన్ సినిమా చరిత్రలోనే కనివిని ఎరుగని బడ్జెట్ రామాయణ కోసం మేకర్స్ పెడుతున్నారనిపిస్తుంది. రామాయణ గ్లింప్స్ తర్వాత పాన్ ఇండియా ప్రేక్షకులు రామాయణ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆత్రుత చూపిస్తున్నారు.