కింగ్ నాగార్జున ఎన్నో ఏళ్లుగా కళ్యాణ్ జ్యువెలర్స్ ని ప్రమోట్ చేస్తూ ఆ జ్యువెలరి యాడ్ లో పాల్గొంటున్నారు. కళ్యాణ్ జ్యువెలర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ నాగార్జున. ఆయన కోడలు కూడా జ్యువెలర్ షాప్స్ ని ప్రమోట్ చేస్తుంది. అయితే అక్కినేని కొత్త కోడలు అంటే అఖిల్ వైఫ్ జైనాబ్ కాదు.
నాగ చైతన్య వైఫ్ శోభిత దూళిపాళ్ల. శోభిత దూళిపాళ్ల మోడల్ కమ్ హీరోయిన్. చైతు తో వివాహమయ్యాక శోభిత దూళిపాళ్ల సినిమాలకు ఎలాంటి బ్రేక్ ఇవ్వలేదు, సినిమాల్లో కొనసాగుతుంది. అంతేకాకుండా శోభిత దూళిపాళ్ల భీమా జ్యువెలర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా జ్యువెలర్ షాప్ ను ప్రమోట్ చేస్తుంది.
శోభిత మోడ్రెన్ గా రెడీ అయ్యి భీమా జ్యువెలర్స్ కొత్త యాడ్ లో కనిపించింది. శోభిత దూళిపాళ్ల భీమా జ్యువెలర్స్ కొత్త యాడ్ ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. మామ కళ్యాణ్ జ్యువెలర్స్ కి కోడలు భీమా జ్యువెలర్స్ కి బ్రాండ్ అంబాసిడర్లు అన్నమాట. మరి అక్కినేని అభిమానులు ఏ జ్యువెలర్ షాప్ కెళ్ళి పర్చేస్ చేస్తారో అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.