Advertisementt

క్రేజీ: ఎన్టీఆర్ కి విలన్ గా భళ్లాలదేవుడు

Thu 03rd Jul 2025 01:49 PM
rana  క్రేజీ: ఎన్టీఆర్ కి విలన్ గా భళ్లాలదేవుడు
Rana to take on Young Tiger NTR క్రేజీ: ఎన్టీఆర్ కి విలన్ గా భళ్లాలదేవుడు
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లారు. ఆతర్వాత ప్రశాంత్ నీల్ డ్రాగన్(వర్కింగ్ టైటిల్) షూటింగ్ పూర్తి చెయ్యాల్సి ఉన్న ఎన్టీఆర్ ఆపి దేవర 2 కంప్లీట్ చెయ్యాల్సి ఉంది. ఈలోపు అనూహ్యంగా ఎన్టీఆర్ లైన్ లోకి త్రివిక్రమ్ వచ్చారు. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబో ని నిర్మాత నాగవంశీ కన్ ఫర్మ్ చేసారు.

త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేష్ తో చెయ్యబోయే చిత్రం కోసం రెడీ అవుతున్నారు. ఆ చిత్రం తర్వాత ఎన్టీఆర్ మూవీ ని సెట్ పైకి తీసుకేళతారు. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో మూవీ నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ ఉంటుందని నిర్మాత నాగవంశీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే ఎన్టీఆర్ చిత్రం కోసం త్రివిక్రమ్ బిగ్ పాన్ చేస్తున్నారట.

తాజాగా ఈ కాంబో పై మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో ఓ పవర్‌ఫుల్ హీరో ను తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. రానా దగ్గుబాటిని ఎన్టీఆర్ కి విలన్ పాత్రలో తీసుకోవాలని త్రివిక్రమ్ తో పాటుగా, నాగవంశీ ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్.

అదే నిజమైతే అప్పట్లో బాహుబలి తో ప్రభాస్ కి విలన్ గా భల్లాలదేవుడి పాత్రలో పాన్ ఇండియా ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసిన రానా ఇప్పుడు ఎన్టీఆర్ కి విలన్ గా ఎలాంటి భీబత్సం సృష్టిస్తారో అంటూ ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. 

Rana to take on Young Tiger NTR:

Trivikram mega plan with Rana for NTR

Tags:   RANA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ