కొన్నాళ్లుగా హీరో నితిన్ కి కాలం కలిసి రావడం లేదు. నితిన్ ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పిన సినిమాలు కూడా నిరాశ పరుస్తూనే ఉన్నాయి. ఒకటా రెండా వరస వైఫల్యాలు పలకరించేసరికి నితిన్ కూడా డల్ అయ్యాడు. ఆయన ఎంతో నమ్మకం పెట్టుకున్న రాబిన్ హుడ్ కూడా డిజాస్టర్ అవడంతో తన దేవుడు పవన్ కళ్యాణ్ టైటిల్ తో తమ్ముడు చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ దర్శకుడిగా చేసాడు.
రేపు శుక్రవారం విడుదల కాబోతున్న తమ్ముడు చిత్ర ప్రమోషన్స్ ను గత వారం రోజులుగా హోరెత్తిస్తున్నారు. మాజీ హీరోయిన్ లయ తమ్ముడు చిత్రంతో కమ్ బ్యాక్ ఇస్తోంది, దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అంత కాన్ఫిడెంట్ తో తమ్ముడు చిత్ర ప్రమోషన్స్ లో కనిపిస్తున్నారు. నితిన్ కూడా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు.
నితిన్ కు అర్జెంట్ గా బ్లాక్ బస్టర్ పడాలి. తమ్ముడు కంటెంట్ కనక మాస్ కి కనెక్ట్ అయితే బాక్సాఫీస్ వసూళ్లు బావుంటాయి. ట్రైలర్ చూస్తుంటే తమ్ముడు కి హిట్ కళ కనిపిస్తుంది. వకీల్ సాబ్ తర్వాత బిగ్ బ్రేక్ తో వేణు శ్రీరామ్ తమ్ముడు తో హిట్ కొట్టాలని కసిగా ఉన్నారు. అటు నితిన్ కి, ఇటు వేణు శ్రీరామ్ కి, లయ కు, గేమ్ చేంజర్ తో దెబ్బతిన్న దిల్ రాజు కి అందరికి తమ్ముడు హిట్ అనివార్యంగా మారింది.
తమ్ముడు చిత్రం నితిన్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచి ఆయన్ని ఒడ్డున పడేయాలని ఆయన అభినులు బలంగా కోరుకుంటున్నారు. చూద్దాం తమ్ముడు రిజల్ట్ ఏమిటి అనేది మరొక్క రోజులో తెలిసిపోతుంది.