పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ అయ్యాక తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి సినిమా చెయ్యకపోయినా.. పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలన్నిటికీ అన్ని తానై అంటే కర్త, కర్మ, క్రియ అన్నట్టుగా త్రివిక్రమ్ వ్యవహరిస్తున్నారు. పవన్ చేసిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో ఇలా ప్రతి చిత్రం వెనుక త్రివిక్రమ్ ఉన్నారు. ఇప్పుడు హరి హర వీరమల్లు వెనుక కూడా త్రివిక్రమ్ ఉన్నారా అంటే ఉన్నారనే చెప్పాలి.
వీరమల్లు దర్శకత్వ బాధ్యతలనుంచి క్రిష్ తప్పుకున్నాక ఆయన ప్లేస్ లోకి జ్యోతి కృష్ణ వచ్చారు. ఆ తర్వాత త్రివిక్రమ్ వీరమల్లు సెట్ లో కనిపించారు. రేపు వారి హర వీరమల్లు ట్రైలర్ రాబోతుంది. ఆ ట్రైలర్ ను ఇప్పటికే పవన్ తో కలిసి త్రివిక్రమ్ కూడా వీక్షించి ఓకె చేసిన విషయాన్నీ మేకర్స్ ప్రకటించారు. పవన్, ఏఎం రత్నం, త్రివిక్రమ్ టీమ్ అంతా వీరమల్లు ట్రైలర్ ను వీక్షించిన వీడియో వదిలారు.
హరి హర వీరమల్లు పవన్ చూసారు, ఆయనకు బాగా నచ్చింది, వీరమల్లు ట్రైలర్ తో గూస్ బంప్స్ రావడం పక్కా అంటూ త్రివిక్రమ్ తో కలిసి ఉన్న ఇక వదలడం చూసిన వారు త్రివిక్రమ్ కనుసన్నల్లోనే వీరమల్లు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.